हिन्दी | Epaper

Rain alert : రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

Sai Kiran
Rain alert  : రెండు రోజుల వర్షాలు, తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

Rain alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఆదివారం ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తేమగాలులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని, దీంతో వర్షాలు పడే అవకాశాలు పెరిగాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Read Also:TN Elections 2026: విజయ్‌కు బీజేపీ బంపర్ ఆఫర్.. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి?

Rain alert
Rain alert

ఏ జిల్లాల్లో వర్షాలు?

ఆదివారం ప్రధానంగా ఉత్తర, పశ్చిమ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870