Heavy rains alert:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 28, 29, 30 తేదీలలో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండనుంది. వాతావరణ నిపుణులు అంచనా ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు విపత్తు నిర్వహణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read also: Rain Alert: ఏపీకి వాయుగుండం ముప్పు.. IMD హెచ్చరిక

అలర్ట్ జారీ చేసిన జిల్లాలు
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావచ్చు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలన్నింటికీ ఎలో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రభుత్వ యంత్రంగం ముందస్తు చర్యలు
ప్రభుత్వ యంత్రంగం అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను ముందస్తు చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రమాదకరంగా ఉన్న వాగులు, వంకాలు, చెరువుల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్ళకూడదని తెలిపారు.
Heavy rains alert:ప్రజలకు రైతులకు కీలక సూచనలు
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: