हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Montha Cyclone: మొంథా తుపాను.. తెలంగాణకు భారీ వర్ష సూచన

Aanusha
Latest News: Montha Cyclone: మొంథా తుపాను.. తెలంగాణకు భారీ వర్ష సూచన

India Meteorological Department (IMD) తెలంగాణకి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ‘మొంథా’ తుపాను (Montha Cyclone) ఆంధ్రా తీరం వైపు వేగంగా దూసుకొస్తోందని.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారిందని చెప్పారు.

DCC Meet: తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై కసరత్తు!

వాతావరణశాఖ అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి తుపానుగా మారే అవకాశం ఉందన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది.

భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు

ముఖ్యంగా అక్టోబర్ 28న సాయంత్రం వేళ కాకినాడ సమీపంలో ఈ ‘మొంథా’ తుపాను (Montha Cyclone)తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా అక్టోబర్ 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేటి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు.జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉందన్నారు. ఈ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Montha Cyclone
Montha Cyclone

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని

ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు.నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని చెప్పారు.

భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్టోబర్ 30 తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870