తెలంగాణలో(Telangana) రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం(low pressure)ఏర్పడిందని, దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం కూడా మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ఆరెంజ్ అలర్ట్ జారీ
ఈ రోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. శనివారం నిర్మల్,(Nirmal) నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
తెలంగాణలో భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?
శుక్ర, శనివారాల్లో తెలంగాణలో(Telangana) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షాలతో పాటు గాలుల వేగం ఎలా ఉంటుంది?
వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also:
Latest News: Kanchan Kumari – రోడ్డు ప్రమాదంలో భారత క్రికెటర్ కంచన్ కుమారి దుర్మరణం