हिन्दी | Epaper

Andhra Pradesh Weather: ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

Aanusha
Andhra Pradesh Weather: ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

Andhra Pradesh Weather: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న తరుణంలో, ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

Read Also: Nara Lokesh on Akshaya Patra: అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

వర్షాలు కురిసే జిల్లాలు ఇవే

అల్లూరి, పోలవరం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించింది.

Andhra Pradesh Weather: Thunderstorms in AP tomorrow
Andhra Pradesh Weather: Thunderstorms in AP tomorrow

మరోవైపు కొన్ని జిల్లాలలో వానలు పడుతుంటే మరికొన్ని జిల్లాలలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి.. కోస్తా జిల్లాలలో కాస్త శాంతించిన సూర్యుడు.. రాయలసీమ జిల్లాలలో మాత్రం మండిపోతున్నాడు. సోమవారం రోజున అనంతపురంలో అత్యధికంగా38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు, నాలుగు రోజులు వాతావరణంలో ఇదే తరహా అనిశ్చితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి వానల నుంచి మోస్తరు వర్షం కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పిడుగులతో పాటుగా ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ అనిశ్చితుల నేపథ్యంలో వచ్చే నాలుగురోజులు కోస్తా జిల్లాలలో ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలు తగ్గుతాయని వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870