హైదరాబాద్(Hyderabad)లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు గురించి చెప్పారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఈ విషయంలో తనపై ఎవరైనా ప్రశ్నించాలంటే మోదీ, కేసీఆర్, కేటీఆర్ మాదిరి నేతలే ఉండాలన్నారు. ఒక్క ఉద్యోగం తక్కువగా ఇచ్చినట్లు నిరూపిస్తే వారి కాళ్ల ముందే క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు.
మహిళలందరూ కోటీశ్వరులవుతారు – రేవంత్ హామీ
తెలంగాణలోని కోటి మంది మహిళలను (Womens ) ఆర్థికంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములుగా చేసి వారిని కోటీశ్వరులుగా మార్చేందుకు కార్యచరణ చేపడతామని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని తానే స్వయంగా ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా ఎదగడం ద్వారా సమాజమే మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విపక్షాల విమర్శలకు ఘాటు ప్రతిస్పందన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చారని సీఎం రేవంత్ విపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా తమ ప్రభుత్వం స్పష్టతతో పనిచేస్తోందని తెలిపారు. వాస్తవాలను అవహేళన చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ప్రజల మద్దతుతో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, ఇకపై మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also : Assembly Elections : 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – సీఎం రేవంత్