గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం
హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు గాంధీ భవన్లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేసీఆర్ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ…