వరంగల్ రైల్వే స్టేషన్ – కాకతీయుల కీర్తికి సాక్షిగా!

వరంగల్ రైల్వే స్టేషన్ – కాకతీయుల కీర్తికి సాక్షిగా!

భారతీయ రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో అమృత్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు 2,737 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Advertisements

వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
కాకతీయ శిల్పకళను ప్రతిబింబించే డిజైన్, వరంగల్ రైల్వే స్టేషన్ ముఖద్వారం కాకతీయ వాస్తు శిల్పాన్ని పోలి ఉండేలా రూపొందించబడింది. ఎంట్రన్స్ వద్ద కాకతీయ కీర్తి తోరణాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేశారు.
ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ
12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మూడు లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించారు. ప్రతీ ప్లాట్‌ఫార్మ్ వద్ద ఆధునిక సౌకర్యాలు, మరుగుదొడ్లు, కూర్చొనే వసతులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేయిటింగ్ హాల్‌ను విస్తరించి మరింత విశాలంగా అభివృద్ధి చేస్తున్నారు.

వరంగల్ రైల్వే స్టేషన్ – కాకతీయుల కీర్తికి సాక్షిగా!


శుభ్రత, పచ్చదనం
స్టేషన్ గోడలు ఆకర్షణీయమైన రంగులతో మెరుగుపరిచారు. టాయిలెట్స్ ను అధునాతన సదుపాయాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు 50% పూర్తయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన పనులను పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

వరంగల్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు
వరంగల్ రైల్వే స్టేషన్ మార్గదర్శక భూమిక, ఈ స్టేషన్ నుండి ప్రధాన ప్రాంతాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి. దక్షిణ & ఉత్తర భారతదేశాన్ని కలుపుతూ వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆర్థిక ప్రాముఖ్యత వరంగల్ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయం రూ.41.09 కోట్లు.
రోజుకు సుమారు 32,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తారు.

భారతీయ రైల్వేలో వరంగల్ స్టేషన్ ప్రాముఖ్యత
కాజీపేట-విజయవాడ సెక్షన్‌లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అనేక రైళ్లకు కీలక కేంద్రంగా వ్యవహరిస్తోంది.
ఆధునికీకరణతో ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవం లభించనుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ తర్వాత ఒక విశిష్ట రైల్వే స్టేషన్‌గా అవతరించనుంది.ప్రయాణికులకు అధునాతన సౌకర్యాలు అందించడంతో పాటు చారిత్రక ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, వరంగల్ రైల్వే స్టేషన్ భారతీయ రైల్వే గొప్ప ప్రగతికి చిహ్నంగా నిలుస్తుంది.

    Related Posts
    KTR: కాంగ్రెస్ పై మరొకసారి విరుచుకుపడ్డ కేటీఆర్
    KTR: కాంగ్రెస్ పై మరొకసారి విరుచుకుపడ్డ కేటీఆర్

    గ్రామీణ ప్రాంతాల దిగజార్పును ఎత్తిచూపిన బీఆర్‌ఎస్‌ నేత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో Read more

    మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు..!
    Legal notices to former CM KCR.

    హైదరాబాద్‌: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది Read more

    Telangana: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : ఒంటిపూట బడులు
    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒంటిపూట బడులు

    Telangana: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు : ఒంటిపూట బడులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతుండటంతో, ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మార్చిలోనే Read more

    గేమ్ ఛేంజర్ షోలపై హైకోర్టు ఆగ్రహం
    గేమ్ ఛేంజర్ షోలపై హైకోర్టు ఆగ్రహం

    తెలంగాణ హైకోర్టు గేమ్ ఛేంజర్ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతినిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పేర్కొన్న జస్టిస్ Read more

    ×