ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధతను దేశవ్యాప్తంగా నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ చేపట్టింది. తాజాగా జేపీసీ ఇచ్చిన 14 సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో, ఈ బిల్లును తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైంది.
వక్ఫ్ బిల్లు
ఆస్తుల్లో మూడో అతిపెద్ద ఆస్తి వక్ఫ్ భూములు, ఆస్తుల చట్టబద్ధతను నిర్ధారించేందుకు మోడీ సర్కార్ ఎప్పటి నుంచోప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టు 8న పార్లమెంట్ లో చట్ట సవరణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆదిలోనే దీనికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే కూటమిలోని పక్షాలు కూడా వ్యతిరేకత తెలపడంతో వెంటనే జేపీసీకి పంపుతున్నట్లు ప్రకటించి ఈ వివాదం నుంచి కేంద్రం తాత్కాలికంగా బయటపడింది.
కమిటీ నివేదిక
కేంద్రం బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ ని ఏర్పాటు చేసింది.
కమిటీ ఫిబ్రవరి 13న కేంద్రానికి నివేదిక సమర్పించింది.
జేపీసీ మొత్తం 14 సిఫార్సులను చేసింది, వీటిని కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది.
ఈ మార్పులు ముస్లిం సమాజ ప్రయోజనాల దృష్ట్యా వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ఉన్నాయి.

మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు
బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో వివిధ పార్టీల ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వక్భ్ చట్టంపై అభిప్రాయాలు సేకరించి ఫిబ్రవరి 13న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీంతో జేపీసీ చేసిన 14 సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగంలో ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కీలక మార్పులు
కేంద్ర మంత్రివర్గం గత వారం జేపీసీ సిఫార్సులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.వక్ఫ్ (సవరణ) బిల్లు కేంద్రం, రాష్ట్రాలలోని వక్ఫ్ బోర్డులను నియంత్రించే ప్రస్తుత వక్ఫ్ చట్టానికి 44 మార్పులను ప్రతిపాదించింది. సమాజ ప్రయోజనాల కోసం ముస్లింల మతపరమైన దానం అయిన వక్ఫ్ ఆస్తుల పాలన, నిర్వహణలో గణనీయమైన మార్పులు ఇందులో ఉన్నాయి.