నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే కొన్ని చిన్న అలవాట్లతో శరీరానికీ, మనస్సుకీ అపూర్వమైన ఫలితాలు లభిస్తాయి. వాటిలో ముందువరుసలో ఉండే సాధన వాకింగ్ యోగా. ఇది సాధారణ నడక కంటే ఎంతో విశిష్టమైనది. అందులో శరీర చలనం మాత్రమే కాకుండా, శ్వాసలతో, మనస్సుతో అనుసంధానం ఉంటుంది. అంతుచిక్కని ప్రశాంతతను, మానసిక స్పష్టతను అందించే విధంగా రూపొందించబడిన యోగా ఇది.

వాకింగ్ యోగా అంటే ఏమిటి?
వాకింగ్ యోగా అనేది శరీర కదలికలను శ్వాస నియంత్రణ, ఏకాగ్రతతో కలిపిన యోగ శైలిని సూచిస్తుంది. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదు – ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది మైండ్‌ఫుల్ వాకింగ్ లేదా మెడిటేటివ్ వాకింగ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగంలో ప్రతి అడుగును, ప్రతి శ్వాసను చైతన్యంతో అనుభవించడమే ముఖ్య లక్ష్యం.
వాకింగ్ యోగా వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు
వాకింగ్ యోగా శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది హృదయానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. కండరాలు బలపడతాయి- ముఖ్యంగా కాళ్ళు, తొడలు, నడుం చుట్టూ ఉన్న కండరాల వ్యాయామం జరుగుతుంది. కీళ్ల చలనం పెరుగుతుంది- ప్రత్యేకించి వయసు పెరిగే వారికీ ఇది ఉపయోగపడుతుంది. శరీర ధారణ మెరుగవుతుంది- నడక సమయంలో సరైన తల, భుజాల స్థానం శరీరాన్ని సరిగ్గా నిలబెడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసుకు ప్రశాంతత, ఏకాగ్రతను ఇస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వాకింగ్ యోగా భావోద్వేగ పునాదిని, సంబంధాన్ని పెంచుతుంది. దీనికి ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. వాకింగ్ యోగా ప్రకృతికి, మనిషికి మధ్య అంతర్గత ఆత్మ సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఇది మనస్సులో శాంతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇది జీవితంలో సమతుల్యత, బుద్ధి, ఆనందాన్ని తీసుకురాగదు.

వాకింగ్ యోగా ఎలా చేయాలి? దానికి ముందు ఏమి చేయాలి?
వాకింగ్ యోగా మొదలుపెట్టే ముందు శాంతంగా కూర్చొని కొంత కాలం మౌనం పాటించాలి. లక్ష్యం నిర్ణయించుకోవాలి- రోజూ ఎంత సమయం లేదా దూరం నడవాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించాలి. శ్వాసపై దృష్టి- నాలుగు అడుగులు ముందుకు వేస్తూ, నాలుగు శ్వాసలు తీసుకోవాలి. తర్వాత నాలుగు అడుగుల నడకతో శ్వాస వదలాలి. ఆలోచనల్ని పక్కన పెట్టి ప్రస్తుత క్షణాన్నే ఆస్వాదించాలి. భుజాలు సూటిగా, చేతులు సహజంగా ఊగేలా ఉండాలి. ఒత్తిడిలేని కదలికలతో నడవాలి. ఉదయం లేదా సాయంత్రం ప్రకృతి వాతావరణంలో వాకింగ్ యోగా చేయడం మంచిది. పార్క్, తక్కువ రద్దీ గల వీధులు లేదా బీచ్ వంటి ప్రాంతాలు శాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగిస్తాయి. దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. షూస్ మృదువుగా, పాదాలకు సానుకూలంగా ఉండాలి. వాకింగ్ యోగా యొక్క ప్రయోజనాలు మొదట కొన్ని రోజులే కనిపించకపోవచ్చు. కానీ దీన్ని రోజూ క్రమం తప్పకుండా చేస్తే, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అసాధారణ మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక సాధన విధానం. నిశ్చలమైన మనస్సుతో, క్రమశిక్షణతో చేస్తే ఇది జీవనశైలిగా మారుతుంది.
Read also: Health: మైగ్రేన్ తో బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్ మీకే