America: అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు చేస్తాం: విదేశాంగ కార్యదర్శి రూబియో

America: అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు చేస్తాం: విదేశాంగ కార్యదర్శి రూబియో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన విధానాలను రూబియో సమర్థించారు.అమెరికాలో ఉంటున్న విదేశీయులకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక హెచ్చరిక చేశారు.అమెరికా సందర్శించడం ఒక హక్కు కాదని, అది ఒక అవకాశం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.ఒక ప్రకటనలో, వీసా పొందినంత మాత్రాన ఎవరికీ దేశ బహిష్కరణ నుంచి మినహాయింపు ఉండదని రూబియో తేల్చి చెప్పారు.జాతీయ భద్రత, వలస విధానాల విషయంలో రాజీపడేది లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికాలోని కొన్ని కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థులు చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహమూద్ ఖలీల్ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు ఖలీల్‌ను దేశం నుంచి పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అమెరికా చట్టాలను, విలువలను గౌరవించే వారికే ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుందని రూబియో స్పష్టం చేశారు.

Advertisements

నిబంధనలను అతిక్రమిస్తే

వీసా పొందిన తర్వాత కూడా నిఘా ఉంటుందని, పరిస్థితులు మారితే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా పనిచేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని రూబియో తెలిపారు.వీసా నిబంధనలను అతిక్రమించినా, నేరాలకు పాల్పడినా, హమాస్ లేదా హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నా వీసాలను రద్దు చేసి, వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని రూబియో హెచ్చరించారు. 

 America: అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు  చేస్తాం: విదేశాంగ కార్యదర్శి రూబియో

ఆందోళన

30 రోజులకు మించి అమెరికాలో ఉండే విదేశీయులందరూ తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలనే నిబంధనను కూడా ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానాల వల్ల ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువ అవుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రజల భద్రత, జాతీయ భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. అమెరికా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకే వీసా వ్యవస్థ ఉద్దేశించబడిందని, దేశాన్ని నాశనం చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని రూబియో హెచ్చరించారు.

Read Also: Russia: ఉక్రెయిన్‌పై దాడి 20 మందికి పైగా మృతి

Related Posts
Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి
బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

బంగ్లాదేశ్‌లో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు భారత్‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నాయి. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ Read more

Manchu Manoj: మోహ‌న్ బాబు ఇంటికి చేరుకొని రచ్చ చేసిన మనోజ్
Manchu Manoj: మోహ‌న్ బాబు ఇంటికి చేరుకొని రచ్చ చేసిన మనోజ్

మళ్లీ వార్తల్లో మంచు కుటుంబం: మ‌నోజ్‌-విష్ణు మధ్య వాడీవేడి వివాదం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుటుంబం మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గత Read more

బ్రెజిల్‌లో G20 నాయకుల సమావేశం: పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్ యుద్ధాలపై చర్చలు
g20

బ్రెజిల్‌లో రియో డి జనీరియో నగరంలో ఈ రోజు నుంచి G20 నాయకుల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సదస్సులో, ప్రపంచంలోని 20 ప్రధాన ఆర్థిక దేశాలు Read more

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×