Vishaka Stadium: విశాఖ స్టేడియం పేరు మార్పు!

Vishaka Stadium: విశాఖ స్టేడియం పేరు మార్పు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పేర్ల మార్పు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏపీ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా జిల్లాలు, మున్సిపాలిటీలు, స్టేడియంల పేర్ల మార్పు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది.

వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చుతూ, దానిని ‘వైఎస్ఆర్ కడప జిల్లా’గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వైసీపీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.అదేవిధంగా, కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును ‘తాడిగడప మున్సిపాలిటి’గా మార్చారు. ఈ మార్పును వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

విశాఖపట్నం స్టేడియం పేరు మార్పు

విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ – వీడీసీఏ స్టేడియం పేరు మార్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వైఎస్ఆర్ ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియం పేరును అధికారులు ఏసీఏ- వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంగా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ అనే పదం తొలగించి కేవలం ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రికి రాత్రే డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంగా మార్చారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా గతంలో తొలగించారని,మహా నేతపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తోంది.

మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చాలా ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును కూడా వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ మార్చిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి సర్కారు కూడా గత ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చింది. సంఘ సంస్కర్తలు, స్వాతంత్రోద్యమ నాయకుల పేర్లతో నామకరణం చేసింది. అలాగే ఇటీవల వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు, తాడిగడప మున్సిపాలిటీ పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది.

Related Posts
కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
The helicopter crashed in M 1

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ Read more

ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
UP by elections. First list of BJP candidates released

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ నేడు (గురువారం) విడుదల చేసింది. రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లో జరిగే Read more

ఏపీలో పేపర్ లీక్ కలకలం
paper leaked

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి గణితం ప్రశ్న పత్రం లీక్ కావడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ ప్రశ్న పత్రం యూట్యూబ్, టెలిగ్రామ్ గ్రూపుల్లో లీక్ Read more

Chandrababu: అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: చంద్రబాబు

సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణం, గత ఓటముల విశ్లేషణ, భవిష్యత్ దృష్టిపై కీలక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *