हिन्दी | Epaper

One Big Beautiful Bill : పెరగనున్న వీసా ఫీజులు

Sudheer
One Big Beautiful Bill : పెరగనున్న వీసా ఫీజులు

అమెరికాలో వీసా తీసుకునే వారి కోసం త్వరలోనే కొత్త ఆర్థిక భారం వేయబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ (One Big Beautiful Bill Act) ప్రకారం, నాన్ ఇమిగ్రెంట్ వీసాలు తీసుకునే ప్రతి ఒక్కరూ ఇకపై అదనంగా ఇంటిగ్రిటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం వీసా అప్లికేషన్ సమయంలో $250 డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటిగ్రిటీ ఫీజు పెరిగే ఛాన్స్

ఈ ఇంటిగ్రిటీ ఫీజు భవిష్యత్తులో మరింత పెరగవచ్చు. 2026 నుంచి ప్రతి సంవత్సరం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ఈ ఫీజు స్వయంగా పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు ఈ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించబోరనీ, రద్దు చేయడానికి కూడా అవకాశం ఉండదని అధికారికంగా వెల్లడించారు. ఈ విధంగా అమెరికాలో వీసా తీసుకునే విదేశీయులకు ఇది భారీ ఆర్థిక భారం అవుతుందని భావిస్తున్నారు.

భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులపై భారం

ఈ కొత్త నిబంధనల వల్ల ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రభావితులయ్యే అవకాశముంది. ఇప్పటికే వీసా ఫీజులు, ప్రాసెసింగ్ ఖర్చులు భారీగానే ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఇంటిగ్రిటీ ఫీజు విధించడం వలస జీవులపై మరింత భారం మోపినట్టే అవుతోంది. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమలైతే, అమెరికాలో వీసా పొందడం మరింత ఖరీదైన ప్రక్రియగా మారనుంది.

Read Also : Chandrababu Naidu : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు స్పష్టత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

వంట గ్యాస్ కొరతతో పెరిగిన ఫుడ్ ఐటెమ్స్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

పోకో నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు.. మార్చి 17న X8 Pro సిరీస్ లాంచ్!

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం: రేపటి నుంచే అదనపు చార్జీలు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై సిగ్మా పట్టు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870