हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Virat Kohli: ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో కోహ్లీ కీలక పాత్ర..

Anusha
Virat Kohli: ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో కోహ్లీ కీలక పాత్ర..

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.అభిమానుల గుండెల్లో ఆనందం నింపింది. ఎన్నో సీజన్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల ఆశలు ఈ విజయంతో ఫలించాయి.గతంలో మూడుసార్లు (2009, 2012, 2016) ఫైనల్స్‌కు చేరినా, టైటిల్ గెలవడంలో విఫలమైన ఆర్సీబీ, ఈసారి మాత్రం పట్టుదలగా ఆడి విజయాన్ని అందుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ బౌలర్లకు గట్టి సవాల్ విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరును సాధించింది. జట్టు స్కోరులో విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43 పరుగులు), రజత్ పాటిదార్ (16 బంతుల్లో 26 పరుగులు), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 24 పరుగులు) కీలక పాత్ర పోషించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించి, పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసి చారిత్రక విజయాన్ని జట్టు ఖాతాలో వేశారు.

ఆర్సీబీ అభిమానులకు ఈ విజయం

లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్, ఆర్సీబీ అభిమానులకు చిరస్మరణీయంగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. విజయం అనంతరం ఆటగాళ్లు, అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.ఈ విజయంపై కింగ్ కోహ్లీ(Virat Kohli) తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించాడు. త‌న‌ సంతోషాన్ని పంచుకుంటూ “ఈ జట్టు కలను సాకారం చేసింది. ఈ సీజన్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. గత రెండున్నర నెలలుగా ఈ ప్రయాణాన్ని మేం పూర్తిగా ఆస్వాదించాం. కష్టకాలంలో కూడా మమ్మల్ని వీడని ఆర్సీబీ అభిమానులకు ఈ విజయం అంకితం. ఎన్నో ఏళ్ల నిరాశ, నిస్పృహలకు ఇది సమాధానం. ఈ జట్టు కోసం మైదానంలో పడిన ప్రతీ కష్టానికి ఇది ప్రతిఫలం. ఐపీఎల్ ట్రోఫీ నిన్ను ముద్దాడ‌టం కోసం న‌న్ను 18 ఏళ్లు వెయిట్ చేయించావు మై ఫ్రెండ్‌. కానీ, ఆ ఎదురుచూపులు నిజంగా విలువైన‌వే అని నిజం చేశావ్‌” అని కోహ్లీ త‌న ఇన్‌స్టా స్టోరీలో ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు. దీనికి ట్రోఫీతో ఆర్‌సీబీ జ‌ట్టు సంబ‌రాల ఫొటోలను జోడించాడు.  

ఐపీఎల్ టైటిల్

ఆర్సీబీ ఈ విజయంతో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఎనిమిదో జట్టు(Eighth team)గా ఆర్సీబీ క్రికెట్ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అచంచలమైన విశ్వాసం, అంతులేని మద్దతు అందించిన అభిమానులకు ఈ విజయం ఒక మధురానుభూతిని మిగిల్చింది.

Read Also: RCB: ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హ‌రీశ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870