విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టు తరఫున 9వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు.ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆర్‌సీబీ తరఫున 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 5 ఓవర్‌లో ఐదో బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇందులో ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌లో ఆర్‌సీబీ తరఫున చేసిన పరుగులు కూడా ఉన్నాయి.ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (9029)పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ(6060) రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. హంప్‌షైర్ తరఫున జేమ్స్ విన్స్ 5934 పరుగులు చేయగా సీఎస్‌కే తరఫున సురేశ్ రైనా 5529, సీఎస్‌కే తరఫున ధోనీ 5314 రన్స్ చేశాడు.
పరుగులు
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. రిషభ్ పంత్(61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా మిచెల్ మార్ష్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ తీసారు.

ఇన్నింగ్స్
అనంతరం ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 230 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 10 ఫోర్లతో 54), జితేశ్ శర్మ(33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 85 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా ఫిల్ సాల్ట్(19 బంతుల్లో 6 ఫోర్లతో 30), మయాంక్ అగర్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో విల్ ఓ రూర్కీ(Will O’Rourke) రెండు వికెట్లు తీయగా ఆకాశ్ సింగ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ తీసారు. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీకి ఇది అతిపెద్ద ఛేజింగ్.
Read Also : RCB: ఐపీఎల్ లో చరిత్రలోనే ఆర్సీబీ అరుదైన రికార్డు