
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల (Tollywood) పోలింగ్ ముగిసింది. 40 శాతానికిపైగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మన ప్యానల్, ప్రొగ్రెసివ్ ప్యానల్ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 3,355 మంది సభ్యులున్న ఛాంబర్‌లో అధ్యక్షుడు, కార్యదర్శి, 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Also: Thalapathy Vijay: సినిమాల కు విజయ్ గుడ్ బై
చిన్న నిర్మాతల నుంచి ఎక్కువ మద్దతు
ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు, కార్యదర్శి సహా మొత్తం 32 మంది కార్యవర్గ సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్ష పదవికి అభ్యర్థి బరిలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.ఈ ఎన్నికల్లో ప్రధానంగా ‘మన ప్యానెల్’ ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ మధ్య గట్టి పోటీ నెలకొంది. చిన్న నిర్మాతల నుంచి ఎక్కువ మద్దతు ‘మన ప్యానెల్’కు లభిస్తుండగా, ఈ ప్యానెల్‌కు సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్ బలమైన మద్దతు ప్రకటించారు.మరోవైపు, అగ్ర నిర్మాతలు అల్లూ అరవింద్, దిల్ రాజు, డి.సురేశ్ బాబు మద్దతుతో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ బరిలోకి దిగింది.
పోలింగ్ సమయంలో ఇరు ప్యానెళ్ల కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొనగా, ఒక దశలో యలమంచిలి రవిచంద్, అశోక్ కుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంలో దిల్ రాజు జోక్యం చేసుకుని సముదాయించారు.ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎప్పుడూ టాలీవుడ్ (Tollywood) లో హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. ఈసారి కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సాయంత్రానికి ఫలితాలు వెల్లడికానుండగా, ఎవరు విజయం సాధిస్తారో చూడాలి అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. బి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: