
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ (‘Raja Saab’). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘రెబల్ సాబ్’ అనే పాటను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇది ఒక సోల్‌ఫుల్ మెలోడీగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
Read Also: Prabhas Raja Saab : రాజాసాబ్ ప్రమోషన్స్ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…
ఫస్ట్ సింగిల్
తమన్ స్వరపరిచిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ (కేకే) సాహిత్యం అందించారు. స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన ప్రోమోలో ప్రభాస్ (Prabhas) తనదైన రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’కు మంచి స్పందన రాగా, ఇప్పుడు ఈ మెలోడీ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పూర్తి పాటను డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: