
హీరో నరేష్ అగస్త్య (Naresh Agastya), అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం, ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాపై (‘Gurram Papireddy’) ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం, ఈ నెల, 19, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేయగా, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Read Also: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి
కథ నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది
ట్రైలర్ చూస్తుంటే.. ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, హాస్యాన్ని మిళితం చేసి ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్‌లో లెజెండరీ నటుడు (Brahmanandam) న్యాయమూర్తి పాత్రలో కనిపించడం,
అలాగే తమిళ నటుడు యోగి బాబు (Yogi Babu) కూడా కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాకు మురళిమనోహర్ దర్శకత్వం వహిస్తుండగా.. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: