కేసిఆర్ మాటే శిరోధార్యం: హరీష్ రావు స్పష్టీకరణ
బిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కేసిఆర్ ఏం చెప్తే అదే తానకి శిరోధార్యం అని ఆ మాటకు జవదాటేది ఉండదని హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు. కేటీఆర్ కి పార్టీ పగ్గాలు ఇస్తానని కేసిఆర్ గాని నిర్ణయిస్తే తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని ఆయన పేర్కొన్నారు.
హరీష్ రావు నిరంతర నిబద్ధత
కేసిఆర్ చెప్పిన ప్రకారం తాను నడుచుకుంటాను అని హరీష్ రావు అనేకసార్లు పదే పదే చెప్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో ఆయన ఈ మాటను పునరుద్ఘాటించారు.
పార్టీలో హరీష్ రావు పాత్ర
వాస్తవంగా చూసుకుంటే కార్యకర్తల్లో గాని, బిఆర్ఎస్ నేతల్లో గాని దాదాపుగా కేసిఆర్ కి నమ్మకస్తుడిగా, ఒక కట్టెపగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది.
విశ్వాసానికి కారణాలు
గతంలో సమీప బంధువుల సమక్షంలో కూడా హరీష్ రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఈ స్థానంలో ఉండడానికి కారణం కేసిఆర్ కాబట్టి, ఆయన ఉన్నంత కాలం ఆయన్ని అనుసరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.
ఉద్యమ నేపథ్యం మరియు అనుబంధం
బిఆర్ఎస్ గతంలో టిఆర్ఎస్ గా ఉండేది. 2001లో పార్టీ ఏర్పడినప్పటి నుండి హరీష్ రావు దాదాపుగా కేసిఆర్ కి వెన్నంటే ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో రెండో స్థానంలో హరీష్ రావు ఉండేవారు.
కేటీఆర్ ప్రవేశంతో మార్పు
ఎప్పుడైతే కేసిఆర్ తనయుడు కేటీఆర్ వారసుడుగా రాజకీయంలోకి ప్రవేశించారో అప్పటినుంచి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రతిసారి కేటీఆర్ కి పార్టీ పరంగా కొంత ప్రాధాన్యత పెరిగింది.
కేటీఆర్ అధికార పగ్గాలు
ప్రస్తుతం అధ్యక్షుల తర్వాత ద్వితీయ హోదా అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. ఈ హోదాతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పైన పట్టు సాధించే అవకాశం లభించింది.
తగ్గుతున్న హరీష్ రావు ప్రాధాన్యత?
హరీష్ రావు గతంలో రాష్ట్రవ్యాప్తంగా తిరిగినప్పటికీ, కేటీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు ప్రాధాన్యత కొంత తగ్గిందని జరుగుతున్న అంశాలను చూస్తే అర్థమవుతోంది.
సభలలో కనిపించే వ్యత్యాసం
ఏదైనా బహిరంగ సభలు, ఉద్యమాలు జరిగినప్పుడు ముందుగా కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు, దాని తర్వాత ద్వితీయ నాయకుడిగా హరీష్ రావు వస్తున్నారు. నిన్న కాకమన్న వరంగల్లో జరిగిన సభ వేదికపై కేసిఆర్, కేటీఆర్ బొమ్మలు మాత్రమే ఉండడం దీనికి నిదర్శనం. బ్యానర్లలో కూడా హరీష్ రావు కనిపించలేదు.
నాయకత్వ శ్రేణి మరియు అనుభవం
దీన్ని బట్టే కేటీఆర్ కే ద్వితీయ శ్రేణి నాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, వీరిద్దరి నాయకత్వాల మధ్య మనం పరిశీలిస్తే, హరీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, కేటీఆర్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచారు.
హరీష్ రావు ప్రజానుబంధం
హరీష్ రావు వ్యక్తిత్వం మృదు స్వభావం. ఆయన ఎక్కువగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, కార్యకర్తలని దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం ఆయన చేయరు.
క్షేత్ర స్థాయిలో చురుకైన కార్యకలాపాలు
ఆయన ముందు నుంచి కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కార్యకర్తల వెంట తిరగడానికి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి మెలిసి ఉంటారు.
తెలంగాణ సమస్యలపై అవగాహన
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల కావచ్చు లేదంటే ఇతర అంశాల వల్ల కావచ్చు మొత్తం తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఏ జిల్లాలో ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు.
కేటీఆర్ విద్యా నేపథ్యం మరియు పట్టు
కేటీఆర్ విద్యాధికుడు, లండన్ లో కూడా చదువుకున్నారు. తనకు ఉన్నటువంటి మేధా సంపత్తిని ఉపయోగించి ప్రస్తుతం పార్టీపై పట్టు సాధించడంతో పాటు సమస్యలపై కూడా అవగాహన సాధించారు.
అసెంబ్లీలో కేటీఆర్ పాత్ర
ఆయన ఏ మాట మాట్లాడినప్పటికీ ప్రతి అంశం మీద కూడా ఆయన కట్టుబడి గట్టిగా మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు చాలా కీలకంగా వ్యవహరిస్తూ ప్రసంగాలు చేసి ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకుంటారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా అసెంబ్లీ సమావేశం ఎలా కొనసాగించాలో ఆయనకు పట్టుంది.
పార్టీ ట్రబుల్ షూటర్
హరీష్ రావు కేటీఆర్ కంటే చాలా సీనియర్ నాయకుడు. తర్వాత ట్రబుల్ షూటర్ గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సమస్యల పరిష్కారంలో ఘనత
పార్టీలో ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఏ సమస్య వచ్చినప్పటికీ హరీష్ రావు ముందుండి దాన్ని అత్యంత సునాయాసంగా పరిష్కరించి, కేసిఆర్ కు అనుకూలంగా ఆ సమస్యని తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉంది.
పార్టీకి ఉపయోగకరమైన గుణాలు
హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత, మృదు స్వభావం, సమస్యల పరిష్కార దక్షత కార్యకర్తలకు, నాయకులకు, పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన వ్యవహరించిన తీరు పార్టీకి ఒక పునాది.
కేసిఆర్ ఆదేశాలకు కట్టుబాటు
ఎవరితో ఏ విధంగా చర్చించాలి, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే దానిపై కేసిఆర్ తో ఆయన పదే పదే చర్చిస్తూ, కేసిఆర్ చెప్పిన మాటను జవదాడకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కేసిఆర్ చెప్పిన మాటే శిరోధార్యంగా ఆయన భావిస్తారు.
బహిరంగ అసంతృప్తికి దూరంగా
పార్టీ ఏర్పడిన తర్వాత కేసిఆర్ చెప్పిన మాటని హరీష్ రావు జవదడిన సందర్భాలు అసలు లేవని చెప్పుకోవచ్చు. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కార్యకర్తల దగ్గర తమ భావాన్ని బయట వ్యక్తం చేయకుండా పార్టీ పటిష్టానికి మాత్రమే ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు.
మంత్రి పదవి నిరాకరణ సందర్భం
గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల తర్వాత సుమారు రెండు మూడు నెలల పాటు పార్టీలో అత్యంత సీనియర్ అయినటువంటి ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది.
అయినా వెనకడుగు వేయలేదు
అయినప్పటికీ హరీష్ రావు ఎక్కడ కూడా తన అసంతృత్వం వ్యక్తం చేయడం గానీ, పార్టీ నుంచి బయటికి వెళ్తానని గానీ, కేసిఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడడం కాానీ మనం ఎక్కడ కూడా చూడలేదు.
కేసిఆర్ అప్పగించిన పనియే కర్తవ్యం
ఆయనకి హరీష్ రావుకి కేసిఆర్ ఏ పని అప్ప చెప్తే ఆ పని చేయడాన్ని తన కర్తవ్యంగా భావిస్తారు.
సన్నిహితుల దృష్టిలో హరీష్ రావు స్థానం
దీన్ని పార్టీ కార్యకర్తలు కావచ్చు, అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి హరీష్ రావు తో మెరిగిన వారు కూడా బయటికి వచ్చిన తర్వాత కేసిఆర్ కి హరీష్ రావు ఒక కట్టెపగా ఉంటారని, ఆయన చెప్పిన మాట జవదాటారని చెప్తారు.
కేసిఆర్ నిష్క్రియాపరత్వం – నాయకత్వ చర్చ
ప్రస్తుతం పార్టీలో గత కొంత కాలంగా ఈ నాయకత్వ విషయంలో తరచూ చర్చలు వస్తున్నాయి. యాక్టివ్ గా ఉన్నటువంటి కేసిఆర్ ఎన్నికల తర్వాత చాలా స్తబ్దగా మారిపోయారు.
కేసిఆర్ ఆరోగ్యం మరియు కార్యకలాపాలు
ప్రధానంగా అనారోగ్య సమస్యతో సుమారు మూడు నాలుగు నెలల పాటు ఫార్మ్ హౌస్ వదలలేని పరిస్థితి ఆయనకి తప్పనిసరి అయింది.
ప్రస్తుతం కేసిఆర్ బహిరంగ సంచారం తక్కువ
ఆ పరిస్థితులు దాటి ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆయన బయటికి పెద్దగా రావడం లేదు. ఎవరైనా పిలిపించుకొని ఫార్మ్ హౌస్ పిలిపించి మాట్లాడుకుంటున్నారు కానీ ఎక్కువగా సభలు సమావేశాలు నిర్వహించడం కాానీ ప్రజల మధ్య వెళ్ళడం గానీ జరగడం లేదు.
అసెంబ్లీలో కూడా తక్కువ ప్రసంగం
పైగా అసెంబ్లీకి కూడా ఆయన వచ్చి ప్రత్యర్థుల మీద పెద్దగా వ్యాఖ్యలు చేయడం కాానీ ప్రసంగాలు చేయడం కాానీ ఆయన పెద్దగా చేయడం లేదు. దీంతో దాదాపుగా మనం చూసుకుంటే పార్టీలో కేసిఆర్ ఒక ఇనాక్టివ్ పర్సన్ గా అయితే ఉన్నారు.
క్రియాశీల నాయకత్వ ప్రశ్న
ప్రస్తుతం ఆయన ఇనాక్టివ్ అవ్వడంతో, క్రియాశీల నాయకత్వం ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, వీళ్ళద్దరిలో ఎవరు నాయకత్వం వహిస్తారు అన్న దాని మీద చర్చ కొనసాగుతుంది.
హరీష్ రావు తాజా స్పష్టీకరణ – సందేహాలు
ప్రస్తుతం హరీష్ రావు కేటీఆర్ నాయకత్వాన్నే నేను సమర్ధిస్తాను అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది అన్నది కూడా మనకి అనుమానమే.
భవిష్యత్ వైఖరిపై అనుమానాలు
గతంలో బంధువర్గం ముందు మాట్లాడినప్పుడు కేసిఆర్ ఉన్న కాలం ఆయన మాటను జవదాటనని, ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తానని, పదవి ఇవ్వకపోయినా సరే కేసిఆర్ వెన్నంటి ఉంటానని చెప్పడం జరిగింది.
నాయకత్వ వివాదాలపై చర్చ
అంటే పరోక్షంగా కేసిఆర్ నాయకత్వం గాని లేకపోతే ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాను అన్న దాని మీద ఆ పదం ఏదైతే ఉందో ‘కేసిఆర్ ఉన్నంత కాలం ఆయన్ని అనుసరిస్తాను’ అన్న పదం, ఇప్పుడు ఆయన ఇనాక్టివ్ అవ్వడంతో ఈ నాయకత్వపు వివాదాలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలనే నిర్ణయం చర్చగా మారింది.
కేటీఆర్ కు కేసిఆర్ ఇస్తున్న ప్రాధాన్యత
అయితే కేటిఆర్ కూడా ఎక్కడ కూడా తానే హరీష్ రావు కంటే గొప్ప అని చెప్పడం జరగలేదు. కాకపోతే జరుగుతున్న పరిణామాలు, సమావేశాలు, సభలు, ప్రాధాన్యతలు ఏదైనప్పటికీ కేసిఆర్ ముందుగా కేటీఆర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది సహజంగా మనకు కనిపిస్తున్న అంశమే.
కార్యకర్తలు అంగీకరించే వాస్తవం
ఇది దాపరికం లేదు, కార్యకర్తలు కూడా అంగీకరిస్తారు. హరీష్ రావు వెన ఉన్నటువంటి సన్నిహితులు శ్రేయబలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ బాధని తరచుగా పదే పదే వ్యక్తం చేస్తుంటారు.
సన్నిహితుల ఆందోళన మరియు చివరి ప్రశ్న
హరీష్ రావుకి ఎంతగా ప్రాధాన్యత లభించడం లేదని వారు అంటున్నారు. ఇదే పరిస్థితి గాని కొనసాగితే రేపు పొద్దున కేసిఆర్ స్థానంలో కేటీఆర్ పార్టీ పూర్తి స్థాయి పగ్గాలు చేపడితే హరీష్ రావు ఇప్పుడు చెప్పిన మాట కట్టుబడి ఉంటారా లేదంటే వేరే నిర్ణయాలు తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది.