हिन्दी | Epaper

Reality Check: ఇది 2024… కానీ కుల బహిష్కరణ మాత్రం 1924 మాదిరే!

Uday Kumar


కుల బహిష్కరణ

కుల బహిష్కరణ – నేడు ఇంకా గలుగుతుందా?

కులమా ఇంకా ఎక్కడుంది అంటారు. ఈ రోజుల్లో అందరూ సమానమే కదా అంటారు. కుల బహిష్కరణ గురించి ఎవరైనా మాట్లాడితే “ఇది 2024… డబ్బు తప్ప లోకాన్ని నడిపించేది ఏది లేదు కదా?” అంటారు. కానీ ఆలయాల్లోనికి రానివ్వరు, సామాజిక సంబంధాల్లో దూరం పెడతారు. కుల బహిష్కరణ ఇంకా కళ్లముందే జరుగుతోంది కానీ చాలామందికి కనపడదు.

పిఠాపురంలో దారుణ ఘటన

లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరిగిన ఘటన మన దేశంలో కుల వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో చెబుతోంది. మల్లం అనే గ్రామంలో ఆధిపత్య కులాల వారు అక్కడి కొందరు దళితులను గ్రామం నుండి బహిష్కరించారు.

కరెంట్ ప్రమాదం – ఆగ్రహానికి కారణం

ఈ నెల 16న మల్లం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో కరెంట్ పని చేయడానికి దళితుడు సురేష్ వెళ్ళాడు. కరెంట్ షాక్‌తో చనిపోయాడు. మృతుడి కుటుంబానికి న్యాయం కావాలని, నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశారు. ఇదే వాళ్లకు కోపానికి కారణమైంది.

నష్టపరిహారం అడిగారంటే తప్పేనా?

ఇక్కడ 2.75 లక్షలు ఇచ్చి సర్దిచేశారు. కానీ అంత సొమ్ము మా వద్ద నుండి ఎలా తీసుకుంటారు? అని మండిపడ్డారు. అందుకే ఆ ఊర్లో ఉన్న దళితులను వెలివేశారు. వారు తినడానికి, కొనడానికి కూడా హక్కులు లేకుండా చేశారు. హోటళ్లు, షాపులు, పనులన్నీ నిషేధించారు.

స్పష్టమైన భౌతిక, సామాజిక దూరం

దళితులతో మిగతా కులాల వారు సంబంధం పెట్టుకోరన్నమాట. ఆ గీత దాటితే తీవ్ర పరిణామాలన్న హెచ్చరికలు కూడా ఇచ్చారు. బాధితులు పోలీసుల వద్దకు వెళ్లారు. ప్రస్తుతానికి పరిస్థితి చక్కబడినట్టే అయినా… అసలు సమస్య ఏమిటంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి?

భావజాలమే వేరే విధంగా ఉంది

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి తక్కువగానే అనిపించినా చుండూరు, కారంచేడు లాంటి ఘోర ఘటనలు మన దగ్గరే జరిగాయి. కాలువల్లో తొక్కించి చంపిన ఘటనలు మన చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో జరిగిన ఘటన మనం పెద్దగా మారలేదని మరోసారి గుర్తుచేస్తోంది.

నిజామాబాద్ ఘటన కూడా ఉదాహరణే

ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఆలయ ప్రవేశం విషయంలో గౌడ మహిళల్ని ఆలయంలోకి రానివ్వలేదు. ఇది తెలంగాణలో కూడా ఇలాంటి విషయాలు కొనసాగుతున్నాయని చెప్పే ఉదాహరణ.

అంతిమంగా – మనమే మారాలి

పట్టణాల్లో కనిపించకపోవచ్చు కానీ పల్లెకు వెళ్ళితే కులం ఆధారంగా వివక్ష స్పష్టంగా ఉంటుంది. మనుషుల్ని కలుపుకుపోవడంలో మొదటి ప్రశ్న “వాడు మన కులానివాడేనా?” అన్నదే కావడం బాధాకరం. ఇది మన నైతికమైన వైఫల్యం.

ఇదే పరిస్థితులుDeputy CM పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు, ప్రజలు ఆయన స్పందన కోసం ఎదురు చూడడంలో తప్పేముంది?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా
0:12

ఒక్కటైన కుల్దీప్ యాదవ్-వన్షిక చద్దా

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

📢 For Advertisement Booking: 98481 12870