
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma) మరోసారి ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ మనముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో ఐదవ చిత్రం అవ్వడం విశేషం.
Vijay: సీఎం స్టాలిన్‌పై నటుడు విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు
ఇప్పటికే మ్యాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) విభిన్న హారర్-కామెడీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది, వాటి విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ఈ సారి కూడా మేకర్స్ ఒక ప్రత్యేకమైన కథ, ఆకట్టుకునే విజువల్స్, ఉత్కంఠభరిత సీక్వెన్సులు, హాస్యభరిత సందర్భాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు.
ఈ సినిమా దీపావళి (Diwali) కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: