
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) నటించిన మార్క్ (Mark Movie) ట్రైలర్ వచ్చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో ట్రైలర్లను విడుదల చేసింది. ఈ (Mark Movie) ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే.. సుదీప్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
Read Also: Jr NTR: వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ కొత్త లుక్
కథేంటంటే
అనుకోకుండా చిన్నపిల్లలు మిస్ అయ్యి చనిపోతుండగా.. ఈ కేసును సుదీప్ ఎలా చేధించాడు అనేది ఈ సినిమా కథ అని టాక్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ సుదీప్ కి, 47వ చిత్రం కావడం విశేషం. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ్ లో,విడుదల కానుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: