డీజీఎంఓ బేటీ వాయిదా, మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
భారత్ పాక్ చర్చల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీల మధ్య హాట్ లైన్ లో డీజీఎంఓ బేటీ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం ఇందుకు ముహూర్తం కరారు చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. చర్చల వేళ తన వైఖరిని తేల్చి చెప్పారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందనకు అనుగుణంగానే నడుచుకోవాలని త్రివిధ దళాలకు ప్రధాని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో చర్చల వేళ తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతుంది.
డీజీఎంఓ బేటీ వాయిదా నేపథ్యం, మోదీ కీలక భేటీలు
మోదీ కీలక సమీక్ష అనంతరం డీజీఎంఓ బేటీ వాయిదా పడింది. ఈ మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సిన బేటీ అనుహ్యంగా వాయిదా వేశారు. ఈ సమయంలోనే ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బేటీ అనంతరం జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై వీరు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈరోజు రక్షణ ఉన్నత అధికారులతో ప్రధాని నిర్వహించిన రెండో కీలక బేటి ఇది. ఇరు వరుసల బేటీలతో పాక్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు మోదీ పదును పెడుతున్నారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. పాక్ ను పూర్తిగా ఫిక్స్ చేసే లక్ష్యంతోనే చర్చలు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
భారత్ కీలక డిమాండ్లు స్పష్టం
రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్ డీజీల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగించడం, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాగా ఈ చర్చల సమయంలో భారత్ తమ డిమాండ్స్ ఏంటనేది తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ కోసం భారత్ ప్రధానితో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాట్లాడిన సమయంలోనే కొన్ని అంశాలపైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా పాక్ లో ఉన్న మసూద్ అజర్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఇదే సమయంలో పివైకోయను పాక్ ఖాళీ చేయాల్సిందేనని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.
పాక్ రెచ్చగొట్టే చర్యలు – భారత్ దీటైన స్పందన
కాల్పుల విరమణ నిర్ణయం తర్వాత భారత్ సరిహద్దు ప్రాంతాలలో పాక్ మళ్ళీ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. భారత సైన్యం వాటిని దీటుగా తిప్పికొట్టింది. ఇక ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారతదేశం స్పష్టంగా చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకరించాలని పాకిస్తాన్ కి తెలిపింది. ముందస్తు తదుపరి షరతులు లేకుండా చర్చలు జరగాలని భారత్ స్పష్టం చేసింది.
ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి – భవిష్యత్ కార్యాచరణ
కాల్పుల విరమణ వేళ జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తమ వైఖరి స్పష్టం చేసేందుకు సిద్ధం అవుతుంది. ఉగ్రవాదుల విషయంలో భారత్ కఠినంగా ఉంటామనే సంకేతాలు ఇవ్వబోతుంది. ఇదే సమయంలో పాక్లో ఆశ్రయం పొందిన ఉగ్రవాదులను అప్పగించే అంశం పైన భవిష్యత్తులోనూ పట్టుబట్టాలని భావిస్తుంది. దీంతో చర్చలకు ముందే భారత్ డీజీఎంఓ మీడియా సమావేశంలో తమ వైఖరి స్పష్టం చేయనున్నారు. దీంతో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.