हिन्दी | Epaper

Telugu News: Crime: అంబులెన్స్ డ్రైవర్ ను చితకబాదిన పోకిరీలు

Pooja
Crime

మానవత్వం(Humanity) రోజురోజు మంటకలసిపోతున్నది. పబ్లిక్ గా ఒక వ్యక్తిని కొందరు పోకిరీలు పొట్టుపొట్టుగా కొడుతుంటే ఎందుకు కొడుతున్నావంటూ ఒక్కరూ అడ్డుకున్న పాపానికి పోలేదు. అంతగా దెబ్బలు కొట్టించుకున్న వ్యక్తి చేసిన నేరం ఏంటి? జస్ట్ దారి ఇవ్వమని అడిగినందుకు. అసలు ఏం జరిగిందో మీరే చదవండి.

Telugu News: Telangana: గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీళ్లు

అంబులెన్స్ కు దారి ఇవ్వమని అడిగిన డ్రైవర్

హైదరాబాద్ నుంచి కోఠి(Koti) ఇఎన్టి ఆసుపత్రి నుండి బాలింతను ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో, బీఎన్ రెడ్డి నగర్ వద్ద కొందరు పోకిరీలు అంబులెన్స్కు అడ్డు వచ్చారు. దీంతో అంబులెన్స్కు దారి ఇవ్వమని డ్రైవర్ యువకులను అడిగాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు అంబులెన్స్ ను ఆపి, డ్రైవర్, సెక్యూరిటీ గార్డపై దాడి చేశారు. డ్రైవర్పై పిడిగుద్దు గుద్దుతూ, పైశాచిక ఆనందాన్ని పొందారు. అంతటితో వదలిపెట్టకుండా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ, చివరికి డ్రైవర్ చేత కాళ్లు మొక్కించుకున్నారు. ఇంత తంతు జరుగుతున్నా దాడి చేస్తున్న యువకులను అడ్డుకునే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం విచారకం. అంబులెన్స్ లో పేషెంట్ ఉన్నా అరగంట సేపు వాహనాన్ని ఆపి, డ్రైవర్, సెక్యూరిటీ గార్డపై దాడికి పాల్పడ్డారు. చివరికి తమదే తప్పని అంటూ యువకుల కాళ్లను మొక్కి డ్రైవర్ తన తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అంబులెన్స్ డ్రైవర్ పై దాడి చేసిన యువకుల చర్య సరైందేనా?

డ్రైవర్‌పై దాడి ఎలా జరిగింది?
యువకులు డ్రైవర్‌ను కొట్టడమే కాకుండా, అవమానపరచి కాళ్లు మొక్కించుకున్నారని సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు స్పందించారా?
స్థానికులు పోలీసుల వద్ద ఫిర్యాదు చేయాలని కోరగా, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం
1:10

వైసీపీ హయాంలో పోలవరం పతనం:సీఎం

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం
1:09

కల్తీ నెయ్యి ఘటనపై సూరంపల్లిలో సీఎం ఆగ్రహం

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి
0:52

సిరాజ్ కి బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన జిటి

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం
0:14

మూడు నెలలుగా భోజనం చెత్త బుట్టల్లో.. ఎన్టీఆర్ జిల్లాలో కలకలం

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు
0:03

విజయవాడలో గ్యాస్ కోసం ప్రజల పడిగాపులు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!
0:18

భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం
1:38

మిల్లెట్ మెనూను ఆవిష్కరించిన సీఎం

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త
1:13

రెండో పెళ్లికి ఒప్పుకోలేదని భార్య ను దారుణంగా కొట్టిన భర్త

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌
2:44

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

📢 For Advertisement Booking: 98481 12870