నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

సోషల్‌ మీడియాలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు

మహా కుంభమేళాలో భక్తి పారవశ్యంలో మహిళలు, అమ్మాయిలు స్నానాలు చేస్తున్నప్పుడు కొంతమంది నీచులు వాటిని వీడియాలు తీసి పోర్న్‌ గ్రాఫీ సైట్లలో పోస్ట్‌ చేస్తున్నారు. మరికొంత మంది వాటిని అమ్ముకుంటున్నారు. ఇంకా నీచానికి దిగజారి పోర్న్‌ సైట్లలో ఉన్న వీడియోలు టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఇవి కుంభమేళాలో స్నానాలు చేస్తున్న అమ్మాయిల వీడియోలు అంటూ అమ్ముకుంటున్నారు.
చేసిన పాపాలు పోతాయని చాలా మంది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా 55 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. అయితే పాపాలు పోతాయని భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే కొంతమంది నీచులు అక్కడ కూడా తామ కామ బుద్ధిని చూపిస్తున్నారు. దాన్ని కూడా ఓ నీచ వ్యాపార మార్గంగా చూస్తున్నారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, వాళ్లు బట్టలు మార్చకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి.. వాటిని పోర్నోగ్రాఫీ సైట్లలో, టెలిగ్రామ్‌ ఛానల్స్‌లో అమ్ముకుంటున్నారు. టెలిగ్రామ్‌లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం.

Advertisements
సోషల్‌ మీడియాలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు


అమ్మకానికి వీడియోలు
అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడిబట్టల్లో వారిని వీడియోలు తీయడం, అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటేంటే వీడియోలు తీస్తున్నారు కొంతమంది దరిద్రులు. వారి కామ వాంఛ తీర్చుకోవడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొన్ని పోర్న్‌ సైట్‌లతో పాటు, ఓపెన్‌ బాతింగ్‌, కుంభమేళా ఉమెన్స్‌ బాతింగ్‌ వీడియోస్‌ అంటూ గ్రూప్‌లు క్రియేట్‌చేసి వాటిలో ఈ వీడియోలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు.
చర్యలకు పోలీసులు సిద్ధం
దీనిపై సోషల్‌ మీడియాతో పాటు మీడియాలోనూ కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. డీఐజీ వైభవ్‌ కృష్ణ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. “వీడియోలు పోస్ట్‌ చేసిన టెలిగ్రామ్‌ ఛానెల్స్‌ను గుర్తించే పనిలో ఉన్నాం. అలాగే వీడియోలు రికార్డ్‌ చేసి అమ్మకానికి పెట్టిన వారిని పట్టుకొని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం” అని తెలిపారు. భక్తి భావంతో వందల మంది చుట్టూ ఉన్నా కూడా మహిళలు పవిత్ర భావనతో త్రివేణి సంగమంలో బహిరంగంగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మన చుట్టూ ఉండేవాళ్లు కూడా భక్తి భావంతోనే ఉంటారు కదా అనే నమ్మకంతో వాళ్లు అక్కడే స్నానాలు చేస్తుంటారు.

Related Posts
Earthquake : భారీ భూకంపం.. ముందే చెప్పిన బాబా వంగా
baba vanga2

ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా చేసిన భవిష్యవాణులు మరోసారి నిజమవుతున్నాయా? ఇటీవల రెండు దేశాల్లో ఒకేసారి సంభవించిన భారీ భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వేలాది Read more

Uzbekistan: ఉజ్బెకిస్థాన్‌లో మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి మృతి
ఉజ్బెకిస్థాన్‌లో మేఘాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి మృతి

మేఘాలయ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి ఉజ్బెకిస్థాన్‌లో మరణించారు. ఆయన వ్యక్తిగత పర్యటన కోసం ఈ నెల 4 నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని Read more

ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు: ఉత్త‌రాఖండ్ సీఎం
uttarakhand cm

ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో Read more

భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..
union minister rajnath singh unveiled ssbn s4 nuclear submarine in visakha suri

న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ సముద్ర తీరంలో అణుసామర్థ్యం కలిగిన నాలుగవ జలాంతర్గామి ఎస్ఎస్‌బీఎన్ Read more

×