జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?

Venezuela :జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?

లాటిన్ అమెరికాలో అత్యంత భయానకమైన క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన ‘ట్రెన్ డెరావువా’ వెనిజ్వెలాలోని టొకోరాన్ జైలులో భారీ స్థావరాన్నే ఏర్పాటుచేసుకుంది. జూ, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్, బెట్టింగ్ షాప్, స్విమ్మింగ్ పూల్‌తో ఈ జైలును ఒక రిసార్ట్‌గా మార్చేసింది ఆ ముఠా. దీంతో ఈ ముఠాను అణచివేసి, జైలును తమ నియంత్రణలోకి తెచ్చుకోవడానికే నికోలస్ మదురో సైన్యాన్ని పంపారు. కానీ, ఈ ముఠా నేత హెక్టర్ గెర్రెరో ఫ్లోర్స్ తప్పించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున దేశం నుంచి బహిష్కరిస్తామంటూ చేసిన వాగ్దానంలో భాగంగా ట్రెన్ డెరావువా సంస్థ కూడా ట్రంప్ లక్ష్యంగా మారింది. అసలింతకీ ఈ సంస్థకు, అమెరికాకు సంబంధం ఏమిటి? ట్రెన్ డెరావువా నేర ముఠా ఎలా పురుడుపోసుకుంది, ఎలా ఎదిగింది?

జైలునే నైట్ క్లబ్‌గా మార్చేసిన వెనిజ్వెలా.. ట్రంప్‌ టార్గెట్ ఇందుకేనా ?

ఈ ముఠా ఎలా ప్రారంభమైంది?
తొలుత ట్రెన్ డెరావువా జైళ్ల గ్యాంగ్‌గా ప్రారంభమైంది. ఈ ముఠాను హెక్టర్ గెర్రెరో ఫ్లోర్స్ అంతర్జాతీయ నేర సంస్థగా మార్చినట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఎవరైనా ఆయన సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల (రూ.43 కోట్ల) రివార్డు ఇస్తామని ప్రకటించింది. 41 ఏళ్ల గెర్రోరో ఫ్లోర్స్, దశాబ్దానికి పైగా టోకోరాన్ జైలుకు వెళ్లి వస్తున్నారు. గార్డుకు లంచం ఇచ్చి 2012లో జైలు నుంచి తప్పించుకున్నారు.

ఈ ముఠా ఎంత పెద్దది?
2014లో వెనిజ్వెలా మానవతా సంక్షోభం, ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూరుకుపోవడంతో ట్రెన్ డెరావువా ఇతర ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం అమెరికా సహా ఎనిమిది ఇతర దేశాలలో ఈ ముఠా నేర కార్యకలాపాలు సాగిస్తున్నట్టు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానిక నేరముఠాలతో కలిసి పనిచేస్తుంది.
ఈ గ్రూపుపై పుస్తకం రాసిన ఒక జర్నలిస్ట్.. ఈ సంస్థలో 5 వేల మంది సభ్యులు ఉన్నారని అంచనావేశారు.

అమెరికా సరిహద్దుల్లో ఈ ముఠా సెక్స్-ట్రాఫికింగ్‌

తమ లక్ష్యాలను సాధించుకునేందుకు హత్యలు, చిత్రహింసలకు తెగబడుతుందన్నారు. లాటిన్ అమెరికాలో ఉన్న ఇతర నేర ముఠాలతో పోలిస్తే ఈ సంస్థ చిన్నదేమీ కాదు. ఈ నేర ముఠా సభ్యులు చిలీ పోలీసు అధికారుల యూనిఫాం ధరించి వెనిజ్వెలా విపక్ష సైనిక అధికారిక రోనాల్డ్ ఒజెడాను కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన మృతదేహం 2024 మార్చిలో చిలిలోని శాంటియాగోలో గుర్తించారు. అమెరికా సరిహద్దుల్లో ఈ ముఠా సెక్స్-ట్రాఫికింగ్‌కు పాల్పడుతోందంటూ ట్రెన్ డి అరగువాను మునపటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని యూఎస్ ట్రెజరీ నిషేధించింది.
అమెరికాకు ముప్పా?
18వ శతాబ్దానికి చెందిన ఏలియన్స్ ఎనిమీస్ యాక్ట్‌ను ప్రయోగించిన ట్రంప్.. అమెరికా భూభాగంలో ట్రెన్ డెరావువా చొరబాటులకు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. వెనిజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నేతృత్వంలో అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డోనల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన వెంటనే.. ఇస్లామిక్ స్టేట్, బోకో హారమ్, నైజీరియా ఇస్లామిస్ట్ మిలిటెంట్ల కేటగిరీలోకి ట్రెన్ డి అరగువాన్ కూడా చేరుస్తూ.. దీన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అమెరికాలోకి వచ్చిన 600 మంది వెనిజ్వెలా వలసదారులకు ఈ ముఠాతో సంబంధం ఉందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ అంచనావేసినట్లు గత వేసవిలో ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది. వారిలో 100 మంది ఈ ముఠా సభ్యులని పేర్కొంది. 2023 నాటికి అమెరికాలో 7,70,000 మంది వెనిజ్వెలా ప్రజలు నివసిస్తున్నారు. ఇతర వలసదారులతో పోలిస్తే స్వల్పంగా 2 శాతం కంటే తక్కువని మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
అమెరికా ప్రభుత్వం వీరిలో చాలామందికి రక్షణ హోదాను కల్పించింది.

Related Posts
ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం..
World Prematurity Day

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం (World Prematurity Day) జరుపుకుంటాం. ఈ రోజు, మార్చ్ ఆఫ్ డైమ్ (March of Dimes) సంస్థ Read more

యుద్దభూమిలోకి అడుగుపెట్టిన పుతిన్
Russian President Vladimir Putin enters the battlefield

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యా లోని కర్క్స్‌ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత Read more

భారత్-చైనా సరిహద్దు చర్చలు..
china-India

చైనా భారత్‌తో మంచి సంబంధాలను స్థిరపరచడానికి సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ పేర్కొన్నారు. రెండు దేశాల నాయకులు తీసుకున్న ముఖ్యమైన ఒప్పందాన్ని Read more

భారత్-చైనా సంబంధాలపై అజిత్ డోవల్ చర్చలు..
ajit doval

ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు (NSA) బుధవారం చైనాలోని ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, చైనావారు, భారతదేశం మరియు చైనా మధ్య సంబంధాలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *