పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు పాల్పడుతున్నారు. గట్టి తాళాలు వేసినా, సీసీ కెమెరాలు పెట్టినా దొంగలు గుట్టుచప్పుడు కాకుండా వాహనాలను అపహరిస్తున్నారు. వరుస దొంగతనాల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.గత కొన్ని రోజులుగా వరుసగా వాహనాలు అదృశ్యమవుతుండటంతో పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా దొంగతనం చేసే ముఠా పని తీరు బయటపడింది. వీరు అర్ధరాత్రి వచ్చి సెకండ్స్ లో తాళాలు పగులగొట్టి బైక్ లేదా ఆటోను దొంగిలించి వెళ్లిపోతున్నారు.

Advertisements

వాహన దొంగతనాలు

సీసీ ఫుటేజ్ చూస్తే వారికి అసలు సంగతి తెలియలేదు. నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామిరెడ్డిపేటలో శావల్యాపురం బొందిలిపాలేనికి చెందిన వీరాంజనేయులు ఐదు నెలలుగా లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఆయన బైక్‌ను రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఇద్దరు యువకులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ సీన్ మొత్తం ఆ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు వీరాంజనేయులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు పట్టణంలోని ప్రకాష్‌నగర్‌‌లో ఆరవై అడుగుల రోడ్డు మూడో లైనులో మరో చోరీ జరిగింది. అక్కడ స్థానికుడైన కటకల నాగరాజు ఆటోను రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు,ఆయన కూడా వెంటనే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ నెల 11 క్రిస్టియన్‌పాలేనికి చెందిన సురేంద్రబాబు నరసరావుపేట రైల్వేస్టేషన్‌ ఆవరణలో తన బైక్‌ను పార్క్ చేసి వినుకొండ వెళ్లాడు ఆయన తిరిగొచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు.

ఫిర్యాదులపై విచారణ

నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను అనలైజ్ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. వాహనదొంగల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

రాత్రివేళల బైక్‌లు, ఆటోలు వీధుల్లో కాకుండా ఇంటి లోపల ఉంచాలి. గట్టి తాళాలు, యాంటీ-థెఫ్ట్ లాక్స్ ఉపయోగించాలి. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సీసీ కెమెరాలను ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకోవాలి.నరసరావుపేటలో వరుస ఘటనల కారణంగా ప్రజలు భయంతో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.దొంగలు ప్రధానంగా ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వాహనాలను ఎత్తుకెళ్లిపోతున్నారు.

Related Posts
రాష్ట్రాన్ని వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా మారుస్తాం – చంద్రబాబు
chandrababu naidu

ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా అభివృద్ధి చేయడం తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం దిశగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో Read more

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల
Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ Read more

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
President Droupadi Murmu ex

తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడినట్లు అధికారులు Read more

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
kodalinani

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , Read more

×