हिन्दी | Epaper

Ragi Uthappam: ఊతప్పం

Hema
Ragi Uthappam: ఊతప్పం

కావలసిన పదార్థాలు

  • రాగులు – ఒక కప్పు
  • మెంతులు – పావు చెంచా
  • దనియాల పొడి – అరకప్పు
  • మినప్పప్పు – అరకప్పు
  • కారం – అరచెంచా
  • ఉప్పు – సరిపడినంత
  • ఉల్లిపాయ ముక్కలు – తగినంత
  • క్యాప్సికం తరుగు – తగినంత
  • క్యారెట్ తురుము – అరకప్పు
  • నూనె – ఒక అరకప్పు
Uthappam

తయారు చేసే విధానం

ముందురోజు రాగుల్నీ, మినప్పప్పునీ, మెంతుల్ని సరిపడా నీళ్లలో (water) నానబెట్టుకుని మరుసటి రోజు గట్టి పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిలో దనియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి మరో నాలుగు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టి పిండిని ఊతప్పం మాదిరిగా పరచి, పైగా ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం (Capsicum) తరుగు, క్యారెట్ తురుము చల్లి, నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే రుచికరమైన ఊతప్పం సిద్ధం.

Uthappam

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cucumber-raita-cucumber-raita/vantalu/541240/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870