Kobbari Kova Burfi: ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే స్వీట్స్‌లో పచ్చి కొబ్బరి కోవా బర్ఫీ కూడా ఒకటి. కొబ్బరి రుచికి పాల కమ్మదనం జతకావడంతో ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేకంగా పండుగలు, శుభకార్యాల సమయంలోనే కాదు.. ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడైనా తక్కువ సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. పాలు, పచ్చి కొబ్బరి, చక్కెరతో పాటు మిల్క్ పౌడర్ లేదా పాల మీగడను ఉపయోగిస్తే బర్ఫీకి మంచి కోవా రుచి, మెత్తని టెక్స్చర్ వస్తాయి. మరి ఈ టేస్టీ స్వీట్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Read Also : Oats Upma: హెల్తీగా ఉండాలంటే ఈ సింపుల్ ఓట్స్ ఉప్మా ట్రై చేయండి!

Kobbari Kova Burfi: కావాల్సిన పదార్థాలు
- పాలు: 1 లీటరు
- పచ్చి కొబ్బరి ముక్కలు: 3 కప్పులు (సుమారు 3 కొబ్బరి చిప్పల నుండి)
- పాల మీగడ: 3-4 టేబుల్ స్పూన్లు (లేదా 1/2 కప్పు మిల్క్ పౌడర్)
- చక్కెర: 2 కప్పులు (మీరు పంచదారకు బదులుగా తురిమిన బెల్లం వాడితే మరింత మంచిది)
- యాలకుల పొడి: 1/2 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా పచ్చి కొబ్బరి చిప్పల నుండి నల్లటి షెల్ (పొట్టు)ను తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 కప్పుల కొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లోకి తీసుకుని నీరు లేదా పాలు కలపకుండా మొదట కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, లీటరు పాలలో నుండి కొద్దిగా పాలను మిక్సీ జార్‌లోకి పోసి, కొబ్బరిని అత్యంత మెత్తగా, సాఫ్ట్‌గా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బర్ఫీ కోవా రుచితో కమ్మగా వస్తుంది. గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని మరియు మిగిలిన పాలను ఒక మందపాటి పాన్‌లోకి తీసుకోవాలి. స్టవ్ ను హై ఫ్లేమ్‌లో ఉంచి, నిరంతరం కలుపుతూ ఉడికించాలి. పాలు పొంగిపోకుండా, పైన వచ్చే మీగడను పాలల్లోకి కలుపుతూ పాలు సగానికి తగ్గే వరకు మరిగించాలి. పాలు సగానికి తగ్గగానే మంటను తగ్గించి, 3-4 టేబుల్ స్పూన్ల పాల మీగడను (లేదా కొద్దిగా పాలలో కలిపిన 1/2 కప్పు మిల్క్ పౌడర్) చేర్చాలి. ఆ వెంటనే 2 కప్పుల చక్కెరను కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం పలుచబడుతుంది. (మీరు పంచదారకు బదులుగా తురిమిన బెల్లం వాడితే మరింత ఆరోగ్యకరమైన, సంప్రదాయ రుచితో కూడిన బర్ఫీ చేస్కోవచ్చు). మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి, మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా గట్టిపడే వరకు నిరంతరం కలుపుతూ ఉడికించాలి అంతే. ఇపుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఉండలా చేస్తే చక్కగా వస్తే సరైన పదం వచ్చినట్లే. చివరిగా 1/2 టీస్పూన్ యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసి, నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకుని ఆరిన తర్వాత బర్ఫీ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :