Besan Ladoo: దీపావళి స్పెషల్ స్వీట్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘బేసన్ లడ్డూలు’

Follow Us: Google News Daily Hunt
Besan Ladoo
Besan Ladoo
FONT SIZE
GET APP

Besan Ladoo: దీపావళి పండుగ వచ్చిందంటే ప్రతీ ఇంట తీపి వంటకాల సందడి మొదలవుతుంది. బంధు మిత్రులకు పంచేందుకు, ఇంట్లో తినేందుకు రకరకాల పిండివంటలు తయారు చేసుకుంటుంటారు. అలాగే కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు పలు రకాల స్వీట్లు, డ్రై ఫ్రూట్స్‌ను దివాళి గిఫ్ట్‌లుగా ఇస్తుంటాయి. ఈ పండుగ స్వీట్లలో శనగపిండితో చేసే బేసిన్ లడ్డూలకు (Besan Ladoo) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నెయ్యి సువాసనతో, వేయించిన శనగపిండి రుచితో, యాలకుల పరిమళంతో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ లడ్డూలను అతి తక్కువ సమయంలో ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

Read Also : Milk peda recipe: ఇంట్లోనే సులభంగా ఇన్స్టంట్ పాల కోవా తయారీ

Besan Ladoo
A special Diwali sweet: ‘Besan Ladoos’ that melt in your mouth

Besan Ladoo: బేసన్ లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు

  • శనగపిండి – 2 కప్పులు
  • పొడి పంచదార – 1 కప్పు
  • నెయ్యి – అర కప్పు
  • యాలకుల పొడి – అర టీస్పూన్
  • బాదం ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
  • పిస్తా ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
  • బొంబాయి రవ్వ – 1 టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)

తయారీ విధానం.. శనగపిండిని వేయించే క్రమం

ముందుగా శనగపిండిని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నెయ్యి వేసి వేడి చేసిన తర్వాత అందులో జల్లించిన శనగపిండి (కావాలంటే బొంబాయి రవ్వ) వేయాలి. దీనిని తక్కువ మంటపై ఉంచి నిరంతరం కలుపుతూ పిండి ముద్దలు కట్టకుండా జాగ్రత్తగా వేయించాలి. మంట ఎక్కువగా పెడితే పిండి బయట మాడిపోయి లోపల పచ్చిగా ఉండే ప్రమాదం ఉంది. శనగపిండి రంగు క్రమంగా మారి లేత బంగారు రంగులోకి వచ్చి, కమ్మని సువాసన వచ్చే వరకు సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఓపికగా వేయించుకోవాలి.

లడ్డూలు చుట్టే విధానం, చిట్కాలు

పిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు పంచదార కలపకూడదు. గోరువెచ్చని మిశ్రమంలో పొడి పంచదార, యాలకుల పొడి, తరిగిన బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని గట్టిగా ఒత్తుతూ గుండ్రంగా లడ్డూలుగా చుట్టుకోవాలి. ఒకవేళ మిశ్రమం పొడిగా అనిపించి లడ్డూలు రాకపోతే కొద్దిగా కరిగించిన నెయ్యి కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన లడ్డూలను పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపిండి లడ్డూలు సిద్ధమవుతాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు