Atukulu Boorelu Recipe:కావలసిన పదార్థాలు:
- బియ్యప్పిండి – 2 కప్పులు
- మినప్పప్పు – తరిగి వేసుకోవడానికి సరిపడ
- బెల్లం తరుగు – 1½ కప్పు
- మందంగా ఉండే అటుకులు – 2 కప్పులు
- కొబ్బరి తురుము – ½ కప్పు
- ఉప్పు – ¼ చెంచా
- యాలకుల పొడి – ¼ చెంచా
- నూనె – వేయించేందుకు సరిపడ

తయారు చేసే విధానం:
- మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకుని ఆ తరువాత మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు వేసుకుని కాస్త చిక్కగా తోపుపిండిని సిద్ధంచేసుకోవాలి.
- అటుకుల్ని జల్లించుకుని, కడిగి పెట్టుకోవాలి. స్టమ్మీద కడాయిని పెట్టి బెల్లం తరుగు వేసి.. పావుకప్పు నీళ్లు (water) పోయాలి. బెల్లం కరిగి చిక్కని పాకంలా మారుతున్నప్పుడు అటుకులు, కొబ్బరి (coconut) తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గరకు అయ్యాక దింపేయాలి. అటుకుల మిశ్రమం చల్లగా అయ్యాక చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు. కమ్మని బూరెలు సిద్ధం.

Read also:hindi.vaartha.com
Read also: