ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ వర్గాలలోను, ప్రజలలోను చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టు పైన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీని తీసుకుంటాం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని, వల్లభనేని వంశీ మాట్లాడిన ఫోన్ కాల్స్, సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసులలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

కస్టడీ పిటిషన్ ఫైల్
టెక్నికల్ గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వల్లభనేని వంశీ కేసుపైన టెక్నికల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన నేడో రేపు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామని తెలిపారు. విచారణలో ఏ కారు ఎక్కడ నుండి వచ్చింది ఎటు వెళ్ళింది అనేది తేలుతుందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ నుండి ఎవరు తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. వల్లభనేని వంశీకి కోర్టు రిమాండ్ గన్నవరం టిడిపి కార్యాలయం పైన దాడి కేసులో ఏ 71 ఎఫ్ఐఆర్ లో ఉన్న వల్లభనేని వంశీ పైన తాజాగా కిడ్నాప్, బెదిరింపుల కింద ఏవన్ గా పోలీసులు కేసు నమోదు చేసి వంశీ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
వంశీకి 14 రోజుల రిమాండ్
కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణ ప్రసాద్ కి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ ను బెదిరించటంలో వల్లభనేని వంశీది కీలక పాత్ర సత్య వర్ధన్ ను బెదిరించడంలో వల్లభనేని వంశీ కీలకపాత్ర పోషించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంతే కాదు వంశీకి చట్టాలపై గౌరవం లేదని తెలిపారు. నేరం చేసిన తర్వాత ఎవరు తప్పించుకోలేరని వల్లభనేని వంశీ ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని విజయవాడ సి పి రాజశేఖర్ బాబు వెల్లడించారు.