हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Vaishnavi Chaitanya : వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!

Divya Vani M
Vaishnavi Chaitanya : వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!

ఓ సినిమాతో గుర్తింపు రావడం సులభం కాదు కానీ వైష్ణవీ చైతన్య ‘బేబి’ మూవీతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమాలో ఆమె నటన, గ్లామర్ బీభత్సంగా పండాయి.యూత్‌కు కాసేపు ఆమె పేరే హాట్ టాపిక్‌గా మారింది.తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువ అన్న మాటను తుడిచేసింది వైష్ణవీ.ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్స్‌ను పోటీకి తెచ్చింది.ఇంతవరకూ సాలిడ్ క్రేజ్ సంపాదించుకుంది అయితే ఇప్పుడు అసలైన టెస్ట్ మొదలైంది అంటున్నారు సినీ’లవ్ మీ’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ జోనర్. అభిమానులు ఆమె కోసం థియేటర్లకు వెళ్లారు.కానీ అక్కడే ఓ నిరాశ ఎదురైంది. స్క్రీన్‌పై ఆమె పాత్రకు బలముండలేదని ఫీల్ అయ్యారు.ఫ్యాన్స్ చెబుతున్నారు.“పాత్రలో స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. కేవలం హవా చాలు కాదు. ఈ పాయింట్‌ను ఆమె గ్రహించాల్సిన అవసరం ఉంది.

Vaishnavi Chaitanya వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!
Vaishnavi Chaitanya వైష్ణవీ కి స్క్రిప్ట్ పరీక్ష మొదలైంది!

ఇప్పుడు విడుదలైన ‘జాక్’ సినిమాకూడా అదే పరిస్థితి. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదంటూ కామెంట్లు వస్తున్నాయి.ఒక హీరోయిన్‌గా స్థిరపడాలంటే కథల ఎంపిక కీలకం. మొదటి సినిమా హిట్ అవ్వడమే కాదు, తర్వాతి అవకాశాలు జాగ్రత్తగా ఎంచుకోవాలి.ఈ విషయంలో వైష్ణవీ ఇంకాస్త సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం ఇది.ఫ్యాన్స్ చెబుతున్న మాటలేంటంటే – తొలిపోటీతోనే టెంపో వచ్చిందని ఊరుకుంటే చాలు. తర్వాతి తప్పులు పబ్లిక్ మర్చిపోవు. కథల ఎంపిక విషయంలో ఆమె తడబడుతున్నట్లు టాక్.స్క్రీన్‌ప్లే బలంగా లేకపోతే ఎవరైనా నలుగురిలో కలిసిపోతారు.ఇకనైనా వైష్ణవీ తన స్క్రిప్ట్ సెలక్షన్‌ను కఠినంగా తీసుకోవాలి.అలా చేస్తేనే ఆమె కెరీర్ లాంగ్ రన్‌లో మెరుస్తుంది. ప్రతిభ ఉందని ‘బేబి’తో చూపించిందని వాళ్లు గుర్తు చేస్తున్నారు.అందుకే ‘స్క్రిప్ట్ క్వాలిటీ’ విషయాన్ని విస్మరించకూడదు ఒక్క గ్లామర్‌తోనే మార్కెట్ నిలబడదు. బలమైన పాత్రలతోనే ప్రేక్షకుల హృదయంలో నిలదొక్కుకోవచ్చు.వైష్ణవీకి నటన ఉంది. గ్లామర్ ఉంది. ఇప్పుడు అవసరం మంచి కథలు. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఆమె నెక్స్ట్ స్టార్ హీరొయిన్ అనడంలో సందేహం లేదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870