ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మానవతా విలువలను తుడిచిపెట్టేలా ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు – సందీప్, అమిత్, ఘజియాబాద్ కు చెందిన గౌరవ్ – ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని మరియు ఒక బాలికను కారులో తీసుకెళ్లారు. మార్గమధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం
తమకు లక్నోలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే నమ్మకంతో యువతులు నిందితుల మాటలు నమ్మి కారులో ఎక్కారు. మార్గం మధ్యలో, నిందితులు బీర్ తాగుతూ అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. యువతి దీనికి తీవ్రంగా వ్యతిరేకించడంతో, వారితో గొడవ చోటుచేసుకుంది. దీనితో ఆగ్రహానికి గురైన నిందితులు మీరట్ సమీపంలో కదులుతున్న కారులోంచే ఆమెను బయటకు తోసేశారు. తలపై తీవ్ర గాయాలు రావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
బాలికపై అత్యాచారం
అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్-బులంద్‌షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, బాలికకు వైద్య సహాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Hyderabad: ఓ వైద్యురాలి నిర్వాకం.. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వైనం