తిరుమలగిరి (నల్గొండ) : కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy), అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈనెల 14న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ (Distribution of ration cards) కార్యక్రమాన్ని ఈనెల 14 న సి ఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడానికి సభ పెట్టడం ఇదొక చారిత్రాత్మక కార్యక్రమం అని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, మంత్రి వర్గం లో అన్ని వర్గాలకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించ్నిని అందులో భాగంగానే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి ఇచ్చిందని చెప్పారు.

ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ తోనే ముందుకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని సంక్షేమ నిధులు లక్ష్మణ్ వద్దనే ఉన్నాయని చెప్పారు. ఆయన ఇప్పుడు మన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రిగా వ్యవ హరిస్తున్నారని ఆయన తెలిపారు. మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి యువజన నాయకులు గా పార్లమెంటులో సమస్యల పైన పోరాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే మందుల సామేలు గురించి నాకంటే మీకే బాగా తెలుసని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన జీవితాన్ని ప్రజలకోసమే పనిచేస్తున్నారని చెప్పారు. శంకర్ నాయక్ ను ఎమ్మెల్సీ చేయమని ఎవరు అడగలేదు కాంగ్రెస్ పార్టీ చేస్నిదన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తాటిపాముల గ్రామంలో పుట్టి పెరిగిన, నేను ప్రజాప్రతినిధిగా కోదాడ హుజూర్నగర్ లోని ఉ్నటున్నానని, తుంగతుర్తిలో రెండు గ్రూపులు ఉన్నాయని నేను వచ్చి మరో గ్రూపు కట్టడం బాగుండదని రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఇంత అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు జరగలేదని, బిఆర్ఎస్ పార్టీ ఉన్న పదేళ్లలో ఏనాడు జరగలేదని, ఈనాడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నికలల్లో 42 శాతం (42 percent of the elections) చేయాలని ఇచ్చిన మాట నిలబెట్టుకొని క్యాబినెట్లో తీర్మానం చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ తో ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పారు. బీసీల కులగనన స్వాతంత్రం తరువాత ఇప్పుడు జరిగిందని, బీసీ కులగనన రాష్టలో మొదటిసారి బీసీ కుల గణన చేయడమే కాకుండా, బీసీలకు వెనుకబడిన తరగతులకు 42!! రిజర్వేషన్ ఏర్పాటు చేసే చట్టం తీసుకొచ్చి క్యాబినెట్ లో తీర్మానం చేశామని, దానికి నేనే చైర్మన్ గా ఉండి ఆర్డినెన్స్ చేశామని, ఆయన చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్తమన్నారు. బీసీల కులగల 100 సంవత్సరాల తర్వాత చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఆయన చెప్పారు 1,4, 0000 ఎనిమినేటర్లతో కులగనన చేయించామని ఆయన అన్నారు గతంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన కులగలనే తప్ప మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదని తమ ప్రభుత్వమే ఈ కులగలను చేసిందని చెప్పారు మందితోఎస్సీ కేటగిరి కొన్ని దశాబ్దాల పాటు వర్గీకరణ చేయలేదని, తానే చైర్మన్ గా ఉండి క్యాబినెట్ ద్వారా ఎస్సీ వర్గీకరణ జరిగిందని చెప్పారు. సన్న బియ్యం కార్యక్రమం హుజూర్నగర్ లో మొదలుపెట్టి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తుంగతుర్తి నుండి మొదలు పెడుతున్నామని తెలిపారు. తాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న, ఈసారి మంత్రిగా ఉన్న నాకు ఎక్కువ సంతోషం సంతృప్తి ఇచ్చిన విషయం జనానికి అందరికీ సన్నబియ్యం ఇవ్వడం అర్హులైన వాళ్లందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని చెప్పారు .
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఏ శాఖ మంత్రి?
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల శాఖ (Irrigation) మరియు Food & Civil Supplies విభాగాల మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతను రేవంత్ రెడ్డి కేబినెట్‌లో 2023 డిసెంబరు 9న ఈ రెండు శాఖల బాధ్యతలు స్వీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Hyderabad: గ్రేటర్లో ఇళ్ల నిర్మాణదారులకు తీపికబురు