చైనాకి అమెరికా సుంకాల సెగ.. ఇండియాకి డిస్కౌంట్ కు సిద్ధం!

Trump Tariffs: చైనాకి అమెరికా సుంకాల సెగ.. ఇండియాకి డిస్కౌంట్ కు సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సుంకాల కారణంగా చైనా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125%కి పెంచారు. దింతో అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125% సుంకం ఛార్జ్ చేస్తుంది. ఈ కారణంగా చైనా కంపెనీలు భారీ నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను విక్రయిస్తుంది, ఇవి చైనా ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, కానీ ఇప్పుడు కష్టంగా మారింది.
5% డిస్కౌంట్ ఆఫర్: అమెరికన్ మార్కెట్ కఠినంగా మారిన తర్వాత చైనా కంపెనీలు ఇప్పుడు భారతదేశంపై దృష్టి పెట్టాయి. దింతో చైనా కంపెనీలు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ET నివేదిక ప్రకారం, అమెరికాతో సుంకాల యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారతదేశానికి మరిన్ని డిస్కౌంట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

Advertisements
చైనాకి అమెరికా సుంకాల సెగ.. ఇండియాకి డిస్కౌంట్ కు సిద్ధం!

డిస్కౌంట్ ద్వారా పెద్ద రిలీఫ్
చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5% డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ మార్జిన్లు ఉన్నందున ఈ డిస్కౌంట్ పెద్ద రిలీఫ్ అవుతుంది. చైనా నుండి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుండి అందుకుంటున్న డిస్కౌంట్ల ప్రయోజనాలను కస్టమర్లకి అందించవచ్చని భావిస్తున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతిదీ చౌకగా మారవచ్చు. అమెరికా తర్వాత చైనాకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ కాబట్టి చైనా అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బొమ్మలు, దుస్తులు, వీడియో గేమ్‌లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, హీటర్లు, ఫర్నిచర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఆక్సెసోరిస్, వైద్య పరికరాల వరకు చాలా ఉత్పత్తులను విక్రయిస్తుంది.

READ ALSO: Microsoft Job Cuts: మే నెలలో మైక్రోసాఫ్ట్ లో మరోసారి ఉద్యోగాల కోత?

Related Posts
రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ, ముగ్గురు మృతి!
రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌జీ, ముగ్గురు మృతి!

స్మార్ట్ ఫోన్లు వచ్చాక యువతలో చాలామంది తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ వచ్చాక చిన్నపిల్లల పై కూడా ఈ ప్రభావం అధికం అయినది. ఇక ప‌బ్‌జీ Read more

ఇరాన్ బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’ – ప్రకృతి అద్భుతం!
ఇరాన్ బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’ – ప్రకృతి అద్భుతం!

ఇరాన్‌లోని రెయిన్ బో ఐలాండ్‌లో ఇటీవలే అద్భుతమైన ప్రకృతి సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కురిసిన వర్షం రక్తం వలే ఎర్రని రంగులోకి మారడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. Read more

సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య
సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య

దాయాది పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు దిగింది. పూంఛ్ జిల్లాలో కృష్ణ ఘాటి Read more

బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
supreme court

ఇటీవల కాలంలో క్షణంలో డబ్బు సైబర్‌ నేరాల చేతిలోకి పోతున్నాయి. మన అమాయకత్వాని ఆసరా చేసుకుని సైబర్‌ నేరాల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. డబ్బు పోగొట్టుకున్నా బాధితులకు సుప్రీంకోర్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×