ఐఫోన్ చేతిలో ఉంటే చాలు ఆ లుక్, ఆ వాల్యూ వేరే అని అనుకునేవాళ్ళకి స్యాడ్ న్యూస్. ఒకప్పుడు కొందరి చేతుల్లోనే కనిపించే ఐఫోన్ ఇప్పుడు కామన్’గా అందరి చేతుల్లో కనిపిస్తుంది. అసలు ఐఫోన్ అంటేనే మన దేశంలో మిగత బ్రాండ్లతో పోల్చి చూస్తే కాస్ట్లీ ఫోన్. ఈ మధ్య కాలంలో వీటి సేల్స్ కూడా పెరిగాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల సెగ ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఐఫోన్లని తాకనుంది.
ఐఫోన్ మోడల్ ధర భారీగా పెరగవచ్చు
మీరు లేటెస్ట్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలని ఆలోచిస్తే.. ఇప్పుడు అంత ఈజీ కాకపోవచ్చు ఎందుకంటే కాస్త ఖర్చు భారం మీపై పడవచ్చు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా మీకు నచ్చిన ఐఫోన్ మోడల్ ధర భారీగా పెరగవచ్చు. ఏంటంటే ఆపిల్ ఈ సుంకాల అదనపు భారాన్ని కస్టమర్లపై పడేయాలని అనుకుంటే ఐఫోన్‌ల ధర 30% నుండి 40% వరకు పెరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి. ఆపిల్ ఐఫోన్లు ఎక్కువగా చైనాలో ఉత్పత్తి అవుతుండగా, ముఖ్యంగా సుంకాల వల్ల చైనా తీవ్రంగా నష్టపోయింది. ఈ సుంకాల ప్రభావం ఆపిల్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టవచ్చు. దింతో కంపనీ ఖర్చులను భరించవచ్చు లేదా ఆ మొత్తాన్ని కస్టమర్లపై బదిలీ చేయవచ్చు

టారిఫ్‌లు ఐఫోన్ ధరలను ఎలా పెంచుతాయి?
అత్యంత తక్కువ ధర లేదా బేసిక్ మోడల్ ఐఫోన్ 16 ధర ఇప్పుడు $799 డాలర్లు (అంటే రూ. 68 వేల కంటే ఎక్కువే), ఆపిల్ ఈ ధరకు టారిఫ్ ధర కలిపితే దాదాపు $1,142 (రూ. 97 వేల కంటే ఎక్కువ)కి పెరుగుతుంది. దీని బట్టి చూస్తే 43% పెరుగుదల ఉండొచ్చు. అలాగే 6.9-అంగుళాల స్క్రీన్, 1-టెరాబైట్ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మాక్స్ వంటి ప్రీమియం మోడల్ ధర దాదాపు $2,300 (సుమారు రూ. 2 లక్షలు) ఉంటుంది. అమెరికా వ్యాపారాలు ఐఫోన్ తయారీని చైనా నుండి తరలించాలని ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ వివిధ రకాల చైనా దిగుమతులపై సుంకాలను విధించిన తర్వాత ఈ పెంపు వార్త వచ్చింది.
మార్కెట్లలో మందగించిన ఐఫోన్ అమ్మకాలు
ఆపిల్ గతంలో ప్రత్యేక మినహాయింపుల ద్వారా ధరల పెరుగుదలను పక్కదారి పట్టించగలిగినప్పటికీ, ఈసారి ఎటువంటి మినహాయింపులు లేకుండా పోయింది. పెద్ద పెద్ద మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఇప్పటికే మందగించడంతో, ధరల పెరుగుదల వల్ల కలిగే అదనపు ఆర్థిక ఒత్తిడి ఆపిల్ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఇంటెలిజెన్స్ అందించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కొందరిని అంతగా ఆకర్షించకపోవడంతో కస్టమర్లు లేటెస్ట్ మోడళ్లను కొనేందుకు అంతగా ఇష్టపడటం లేదు.
ఐఫోన్ యూజర్లు నెక్స్ట్ ఎం చేయాలంటే..
ఆపిల్ కంపెనీ టారిఫ్‌ల భారాన్ని కస్టమర్లకు పై వేయాలని అనుకుంటే ఐఫోన్ అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే ధరలు పెరగడం వల్ల కస్టమర్లు శామ్‌సంగ్ వంటి ఇతర ఆల్ట్రనేటివ్ ఫోన్స్’కి మారాల్సి రావచ్చు. శామ్‌సంగ్ ఫోన్‌లు చాలా వరకు చైనా దేశాలలో ఉత్పత్తి అవుతున్నందున తక్కువ టారిఫ్‌ల నుండి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
ALSO READ: Canada: కెనడాలో భారతీయుడి దారుణహత్య