తహవ్వుర్ రాణా అప్పగింతపై స్పందించిన యూఎస్

America: తహవ్వుర్ రాణా అప్పగింతపై స్పందించిన యూఎస్

ముంబయి ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్​కు అప్పగించడంపై అమెరికా స్పందించింది. 26/11 ఉగ్రవాద దాడులు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించింది. ఉగ్రదాడుల బాధ్యులకు తగిన శిక్ష పడేలా భారత్‌ చేస్తున్న ప్రతి పనికి అమెరికా మద్దతిస్తోందని వెల్లడించింది.
అమెరికా, భారత్ కలిసి పని చేస్తాయి
“భయంకరమైన 2008 ముంబయి ఉగ్రదాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతడిని భారత్​కు అప్పగించాం. ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా, భారత్ కలిసి పని చేస్తున్నాయి. ముంబయి ఉగ్రదాడిలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన దాడులను కొంతమంది గుర్తుంచుకోకపోవచ్చు. కానీ ఈ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్‌ వ్యాఖ్యానించారు.

Advertisements
తహవ్వుర్ రాణా అప్పగింతపై స్పందించిన యూఎస్

బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా అడుగులు
తహవ్వుర్ రాణాను భారత్​కు అప్పగించడాన్ని ముంబయి దాడుల బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా వేసిన కీలకమైన అడుగుగా యూఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి ఒకరు అభివర్ణించారు. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరిపేందుకు భారత్​కు అతడిని అప్పగించామని పేర్కొన్నారు.
ఈ కేసులో తహవ్వుర్ హుస్సేన్ రాణా తన సహ కుట్రదారు డేవిడ్ కోల్​మన్ హెడ్లీకి భారత వీసా పొందడానికి సహాయం చేశాడని ముంబయి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాణా పదేళ్ల వీసా పొడిగింపు పొందడానికి కూడా సాయపడ్డానని వెల్లడించారు.
సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
భారత్​కు తనను అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో రాణా వేసిన పిటిషన్‌ సైతం తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని భారత్​కు తీసుకొచ్చేందుకు వీలుపడింది. ఈ క్రమంలోనే భారత్​కు చెందిన అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లారు.

READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

Related Posts
భారత జట్టు పై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత జట్టు పై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దుబాయ్‌లో ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ Read more

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
Polling for Delhi Assembly elections is over

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ Read more

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్ కౌంటర్.. 10 మంది మావోయిస్టుల మృతి
Massive encounter in Chhattisgarh. 10 Maoists killed

ఛత్తీస్‌గఢ్‌‌: ఛత్తీస్ గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. Read more

Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?
Delhi: చల్లనైన మనసు గల ప్రిన్సిపల్ ఏం చేసిందంటే?

వేసవి వేడి భరించలేని స్థాయికి చేరిన ఈరోజుల్లో, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఓ కాలేజీ ప్రిన్సిపల్ చేసిన పని నెట్టింటా హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×