Polling for Delhi Assembly elections is over

ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్‌ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నార్త్‌-ఈస్ట్‌ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ రికార్డైంది. మధ్య ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.

image

ఇక, మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా.. ప్రముఖంగా మాత్రం ఆప్-బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నయి. 27 ఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా.. ఆప్ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది. మరోవైపు.. 2013 వరకు 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

Related Posts
పిల్లర్లు లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?
బిగ్ అప్డేట్.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. సిమెంట్, స్టీల్ ఖర్చును తగ్గించేందుకు పిల్లర్లు లేకుండానే ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా, ఇళ్ల Read more

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ ప్రతిఏడు సీజనల్ సమయానికి సాధారణంగా ఉండే విషయం. ప్రస్తుతం, స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడడం Read more

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో పాల్గొని, ఆర్‌కే పురంలో ఓ భారీ సభను నిర్వహించారు. 11 ఏళ్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనపై Read more

జాక్ పాట్.. అంటే ఈ లారీ డ్రైవేరేదేపో..!!
Truck driver wins Rs 10 cro

పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *