కశ్మీర్ లోని పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)విజయవంతమైంది. ఆ దెబ్బకు పాకిస్తాన్(Pakisthan) తోక ముడిచింది. కాల్పుల విరమణకు వినతులు పంపడంతో భారత్ దాన్ని అంగీకరించి యుద్దాన్ని ముగించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు విషయంలో మాత్రం వెనక్కి తగ్గరాదని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐరాస భద్రతా మండలిలోని 15 సభ్యదేశాలతో పాటు భారత్ మిత్రదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాల్ని పంపి పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుని వివరిస్తోంది.

చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు సంతాపం
ఇందులో భాగంగా అమెరికాతో పాటు దాని చుట్టుపక్కల దేశాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందానికి దక్షిణ అమెరికాలోని కొలంబియాలో అనుకోని షాక్ తగిలింది. పాకిస్తాన్ ఉగ్రచర్యల్ని వివరించి భారత్ కు మద్దతు సంపాదించేందుకు వెళ్లిన శశిథరూర్ బృందం తమ వివరణ ఇచ్చేలోపే కొలంబియా ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు సంతాపం ప్రకటించింది. దీంతో శశిథరూర్ బృందం షాకయ్యింది.
తమకు కాస్త నిరాశ కలిగింది:శశిథరూర్
భారత దాడుల తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన ప్రాణనష్టానికి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేసిన కొలంబియా ప్రభుత్వ ప్రతిస్పందన తమకు కాస్త నిరాశ కలిగించిందని ఈ సందర్భంగా శశిథరూర్ వెల్లడించారు. ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి చూపడం కంటే కొలంబియాలోని తమ స్నేహితులకు ఉగ్రవాదులను పంపేవారికి, వారిని ప్రతిఘటించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదని తాము చెప్తామని థరూర్ తెలిపారు. దాడి చేసేవారికి, రక్షించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదన్నారు.
తాము తమకు ఉన్న ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. అవాగే ఈ అంశంలో ఏదైనా అపార్థం ఉంటే, దాన్ని తొలగించడానికి తాము కొలంబియాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కొలంబియాకు వాస్తవ పరిస్దితుల్ని వివరిస్తామని ఆయన తెలిపారు.
Read Also: UN: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్