కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తోన్నారు. బాహటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతు పలుకుతున్నారు.
ఒకే వేదికపై డీకే శివకుమార్, అమిత్ షా
కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీని లేవదీసింది. ఇది అక్కడితో ఆగలేదు. దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్దుకోలేరంటూ ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని రేపింది. డీకే శివకుమార్‌లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. జనం ఏవేవో చెప్పుకొంటోన్నారు గానీ ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు


ముఖ్యమంత్రి కావడం డీకేశికి బహుమతిగా ఇవ్వాల్సింది కాదని కష్టపడి సంపాదించినదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు. వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకేశి. పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కానున్నానని చెప్పారు.
వీరప్ప మొయలీ వ్యాఖ్యలు వ్యక్తిగతం
వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని, ఏదో ఒక రోజు సీఎం అవుతాడనే అన్నాడని గుర్తు చేశారు. కష్టపడి పని చేసినందుకు డీకేకు రివార్డ్ దక్కడం ఖాయమేనని, ఈ విషయాన్ని ఖరారు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని, ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. పార్టీ, ప్రజల కోసం కష్టపడి పని చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు రివార్డు దక్కుతుందని అన్నారు. వీరప్ప మొయలీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు.

Related Posts
సోషల్ మీడియా మోసానికి బలైన బ్రిటన్ యువతి – దిల్లీలో దారుణ ఘటన
సోషల్ మీడియా మోసానికి బలైన బ్రిటన్ యువతి – దిల్లీలో దారుణ ఘటన

సోషల్ మీడియా పరిచయాన్ని నమ్మి బ్రిటన్‌కు చెందిన ఒక యువతి భారతదేశానికి వచ్చి, అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఘోరంగా మోసపోయింది. దిల్లీలోని మహిపాల్పుర్ ప్రాంతంలో ఆమె Read more

యథాతథంగానే రెపో రేటు..
rbi announces monetary policy decisions

న్యూఢిల్లీ: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంతో ముగిసిన మూడు రోజుల Read more

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల స్వీకరణ
ISRO accepting applications for 'Young Scientist'

న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. శ్రీహరికోటతో పాటు… డెహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), Read more

NCC 76 సంవత్సరాల ఘనమైన ప్రయాణం
ncc scaled

భారతదేశంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలోని యువతకు సైనిక శిక్షణ ఇచ్చే ప్రముఖ సంస్థగా NCC తన ప్రయాణాన్ని 1948లో Read more