కోర్ట్ తరహా కంటెంట్ ను ఇంట్రెస్టింగ్ గా అందిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే విషయాన్ని ఈ మధ్య వచ్చిన ‘కోర్ట్’ సినిమా నిరూపించింది. అలాంటి ఒక కోర్టు డ్రామాగా రూపొందిన మరో సినిమానే ‘ఉద్వేగం’.త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన కోర్టు డ్రామా మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ, సీనియర్ సురేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఉద్వేగం చిత్రం, మంచి అంచనాలతో గత ఏడాది నవంబర్ లో రిలీజ్అయ్యింది.ఈ రోజు నుంచి ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
కథ తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. మహీంద్రా (త్రిగుణ్) ఓ లేయర్స్స్ ఆర్గనైజేషన్ లో లాయర్. తనదైన శైలిలో క్రిమినల్ కేసులను డీల్ చేస్తుంటాడు. అతని గురువు పరుచూరి గోపాలకృష్ణ. న్యాయం కోసం జడ్జిని సైతం ఎదిరించే క్యారక్టర్. ఇక న్యాయ వృత్తి శ్వాసగా భావించే మహీంద్రా లైఫ్ లో ప్రేయసి అమ్ములు (దీప్షిక) కూడా ప్రధాన భాగం. మహీంద్రా అనుకోకుండా గ్యాంగ్ రేప్ కేసు డీల్ చెయ్యాల్సి వస్తుంది. కేసు ను సీరియస్ గా తీసుకుని కేసులో ఏ2 అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. ఇది నచ్చని అమ్ములు మహేంద్రతో గొడవపడి విడిపోతుంది.మరోవైపు లాయర్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఈ కేస్‌లో పసలేదని నలుగురుకి శిక్ష విధించి కేస్ క్లోజ్ చేయాలని జడ్జి సమక్షంలో వాదిస్తాడు. కానీ మహీంద్రా లోతుగా పరిశోధించి ఏ4 ముద్ధాయిని కాపాడాలని చూస్తాడు.ఆ కోణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహీంద్రా ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయట పడేయగలిగడా? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ
సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలు నాలుగు గోడల మధ్యనే జరుగుతూ ఉంటాయి. సంభాషణలతోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఒక సినిమాను తీయాలని అనుకునేవారు ఎంచుకునే జోనర్లలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. కేసు వాద ప్రతివాదాలు ఆసక్తికరంగా ఉన్నప్పుడే, ఇలాంటి కంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఏ మాత్రం కంటెంట్ వీక్ గా ఉన్నా ఆడియన్స్ అసహనానికి లోనవుతూ ఉంటారు.మరి ‘ఉద్వేగం’ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? అంటే, అది సినిమా చూసి తెలుసుకోవాలి.ఒక గ్యాంగ్ రేప్ జరగడానికి దారితీసిన పరిస్థితులు ఆ తరువాత చోటుచేసుకున్న సంఘటనలు ఇన్వెస్టిగేషన్ కోర్టులో నేరస్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇలా కుతూహలాన్ని పెంచే ఒక ట్రాక్ నాన్ స్టాప్ గా నడవాల్సి ఉంటుంది. కానీ ఈ తతంగమంతా తూతూ మంత్రంగా మాత్రమే కానిచ్చేశారు.అసలు విషయానికి ముందు క్రిమినల్ లాయర్ తెలివితేటలు చూపించడానికి ప్లాన్ చేసిన ఎపిసోడ్ బాలేదనిపిస్తుంది. కథలో కీలకమైన అంశాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా తేలిపోతూ ఉంటాయి. ఇక ఈ కథలో ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టుల సంగతి అలా ఉంచితే, మిగతా ఆర్టిస్టుల నుంచి తీసుకున్న అవుట్ పుట్ అంతంత మాత్రంగా అనిపిస్తుంది.