Kamepalli Tulasi Babu

పోలీసుల కస్టడీకి తులసిబాబు

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు లో నిందితుడు కామేపల్లి తులసి బాబు ను గుంటూరు కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తులసి బాబును ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఈనెల 8న తులసి బాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.

Kamepalli Tulasi Babu


హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ రాసిన లేఖే తన హత్యకు కుట్ర జరిగిందనడానికి మరో ఆధారమని రఘురామ తెలిపారు. ‘వీఐపీ వస్తున్నారు.. జీజీహెచ్‌లో గుండె వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేస్తూ ముందుగానే కలెక్టర్‌ లేఖ రాశారు. కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్‌ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబు ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

Related Posts
అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల
Jana Sena avirbhava sabha Poster Released

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు Read more

పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు
pawan lokesh

బుధువారం తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ల పర్యటన లు రద్దు Read more

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు Read more