మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కిందటి నెల 31వ తేదీ నాడే సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.
బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్ట్‌లు రద్దు
అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్‌లో భాగంగా టారిఫ్‌ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నారు.ఈ క్రమంలో మరో అడుగు ముందుకేశారు ట్రంప్. రక్షణ శాఖకు సంబంధించిన టెక్ దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు. బిలియన్ల కొద్దీ డాలర్ల కాంట్రాక్ట్‌లు రద్దు కానున్నాయి. ఫలితంగా ఐటీ రంగం తీవ్ర కుదుపులకు లోనవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు
కాస్ట్- కటింగ్ చర్యలో భాగంగా డెలాయిట్, యాక్సెంచర్ వంటి సంస్థలతో గతంలో కుదుర్చుకున్న 5.1 బిలియన్ డాలర్ల విలువ చేసే కాంట్రాక్టులను రద్దు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు. డెలాయిట్, యాక్సెంచర్, బూజ్ అలెన్, వాటికి మంజూరు చేసిన 5.1 బిలియన్ డాలర్ల ఐటీ, కన్సల్టింగ్ కాంట్రాక్టులను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
READ ALSO: Donald Trump:ఆరు వేల మంది వలసదారులను రికార్డుల్లో మరణించినట్లు నమోదు చేసిన ట్రంప్ సర్కార్