వారెన్ బఫెట్ పై ప్రభావం చూపని ట్రంప్ టారిఫ్‌

Warren Buffett: వారెన్ బఫెట్ పై ప్రభావం చూపని ట్రంప్ టారిఫ్‌

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రస్తుత మార్కెట్లు కుదేలయ్యాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జూకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల వ్యవధిలోనే యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం.

Advertisements
వారెన్ బఫెట్ పై ప్రభావం చూపని ట్రంప్ టారిఫ్‌

బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లు
అయితే ఈ ట్రెండ్ బెర్క్ షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. అమెరికా స్టాక్ మార్కెట్‌లో బఫెట్ జోరు కొనసాగిస్తున్నారు. తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆయన తన సంపదను 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.
ముందస్తు అంచనాతో నిలదొక్కున్న బఫెట్
2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలోనే బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాది ముగించింది. మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే ముందస్తు అంచనాతో బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించడంతో పాటు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై పెట్టుబడులు రెట్టింపు చేశారు. దీంతో తాజా ట్రెండ్ బఫెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.

READ ALSO: Bill Gates : భారతీయులు గొప్ప ప్రతిభావంతులు – బిల్ గేట్స్

Related Posts
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి – మదుపర్ల ఆందోళన పెరుగుతోంది కొన్ని రోజుల పాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి Read more

ఎలన్ మస్క్‌ను నేపాల్ సందర్శనకు ఆహ్వానించిన ప్రధాని ఓలి..
oli musk

నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సమావేశం ఇద్దరి మధ్య Read more

ట్రంప్ హోటల్ ముందు కారులో పేలుడు
Car explosion in front of Trump hotel

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన అంతర్జాతీయ హోటల్‌ భవనం ఎదుట బుధవారం పేలుడు జరిగింది. టెస్లా కారులో పేలుడు సంభవించింది. Read more

పులివెందులలో నాటు తుపాకీతో కాల్పులుపుల
పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్లో ఘర్షణ. తుమ్మలపల్లి కి చెందిన కోరా నాగిరెడ్డి పై బబ్లు అనే వ్యక్తి దాడి. నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిందితుడి కోసం గాలింపు

పులివెందులలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న క్లబ్లో ఘర్షణ. తుమ్మలపల్లి కి చెందిన కోరా నాగిరెడ్డి పై బబ్లు అనే వ్యక్తి దాడి. నాగిరెడ్డికి తలపై గాయాలు కావడంతో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×