ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్ .డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులను సుంకం నుంచి మినహాయించనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. స్మార్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్, చిప్స్‌కు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులకు సైతం ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నది. ట్రంప్ పరిపాలన సుంకాలను యథావిధిగా అమలు చేస్తే ఆయా వస్తువల ధరలను పెరిగే అవకాశం ఉండేది. ప్రస్తుతం అవే ధరలు కొనసాగే అవకాశం ఉన్నది. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం అనేక వస్తువలకు సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆపిల్, శామ్‌సంగ్ వంటి బడా టెక్ కంపెనీలకు ఎంతో ఊరట కలుగనున్నది. ఎందుకు కంటే ఆయా కంపెనీల ఉత్పత్తులు చాలా వరకు అమెరికాలో తయారయ్యే అవకాశం లేదు. ఇతర దేశాల నుంచి మాత్రమే ఆయా కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. ఆయా ఉత్పత్తులకు అమెరికాలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ, అవి ఎక్కువ చైనా, కొరియా, వియత్నాం తదితర దేశాల్లో ఉత్పత్తి అవుతుంటాయి. వాటిపై భారీ పన్నులు విధించినట్లయితే, కంపెనీలు నష్టపోయే అవకాశం ఉండడంతో పాటు వినియోగదారులపై సైతం అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ సర్కారు సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
ఉపశమన వార్త
దీని అర్థం ప్రస్తుతానికి వారిపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించడం లేదు. ఈ వస్తువులు భారీ 125% చైనా సుంకం లేదా ఇతర దేశాలపై విధించే సాధారణ 10% ప్రపంచ సుంకంలో చేర్చడం లేదని యూఎస్ కస్టమ్స్, సరిహద్దు రక్షణ శుక్రవారం రాత్రి ప్రకటించింది.ఆపిల్ సంస్థకే కాదు, ప్రపంచవ్యాప్తంగా తమ గాడ్జెట్ల పట్ల మక్కువ ఉన్నవారికి కూడా ఒక ఉపశమన వార్త. ఈ పరికరాలు – ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ భాగాలు, మెమరీ చిప్‌లు వంటివి. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్‌లో తయారు కావు. అక్కడ వారి కర్మాగారాలు నిర్మించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. అందుకే ఈ పన్నులు అమలు చేయబడితే, అది కంపెనీలు, కస్టమర్లు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది.

10% సుంకం
అమెరికాలో పెట్టుబడులు పెడుతున్న తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో వంటి పెద్ద కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే ఇతర చిప్ తయారీదారులకు ఉపశమనం కలిగిస్తుంది. అయితే, టెక్ పరిశ్రమకు ఈ మార్గం పూర్తిగా సులభం కాదు. భవిష్యత్తులో కొన్ని సాంకేతిక ఉత్పత్తులకు ప్రభుత్వం వేర్వేరు సుంకాలను ప్రవేశపెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. కానీ ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్స్‌పై 10% సుంకాన్ని కొనసాగించాలనే నిర్ణయం ఆపిల్, దాని వినియోగదారులకు పెద్ద ఉపశమనం.
Read Also: Russia: ఇండియన్ ఫార్మా కంపెనీ గోదాముపై రష్యా దాడి!