25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

Donald Trump: 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం సుంకం విధించాలని డోనల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రయోజనం పొందే అవకాశం ఉండవచ్చేమో కానీ, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయేమోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ నిర్ణయం భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలపై ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉంది. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనిజ్వెలా పూర్తిగా ఖండించింది. ఇది అక్రమమని, నిస్పృహతో కూడుకున్నది అని ఆరోపించింది. ట్రంప్ నిర్ణయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజ్వెలాలో ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ఉత్పత్తినే వెన్నెముకగా భావిస్తారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్. తన అవసరాల కోసం భారత్ 80 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, నైజీరియా వంటి దేశాల నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తోంది. 2018 ఎన్నికల్లో నికోలస్ మదురో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు అమెరికా 2019లో వెనిజ్వెలాపై కఠినమైన ఆంక్షలు విధించింది.

25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

భారత్ అధికారిక వాణిజ్య డేటా ప్రకారం..
2019లో మనదేశానికి ఐదవ అతిపెద్ద చమురు సరఫరాదారు వెనిజ్వెలా. భారత శుద్ధి కర్మాగారాలకు 16 మిలియన్ టన్నుల ముడి చమురును సరఫరా చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ శుద్ధి కర్మాగారాల వాటా ఎక్కువ. అయితే, భారత్ ప్రస్తుత చమురు దిగుమతుల్లో వెనిజ్వెలా వాటా రోజుకు 4.5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఉంది. ఇది గతంలో కంటే చాలా తక్కువ.

ఏడాది జనవరిలో భారత్ రోజుకు 65,000 బ్యారెళ్ల వెనిజులా ముడి చమురును, ఫిబ్రవరిలో రోజుకు 93,000 బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఒక బ్యారెల్‌లో దాదాపు 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది.ఈ నిర్ణయం చాలా వింతగా ఉందని, అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తోందని ఇంధన విధానం, భౌగోళిక రాజకీయాల నిపుణులు నరేంద్ర తనేజా అన్నారు. ”భారత్ ఇప్పుడు వెనిజ్వెలా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయడం లేదు. భారతదేశం తన మొత్తం చమురులో 1.7 శాతం మాత్రమే వెనిజ్వెలా నుంచి కొంటోంది. అది కూడా ఒక ప్రైవేట్ శుద్ధి కర్మాగారం ద్వారా దిగుమతి అవుతోంది.
మార్కెట్లో ఒక శాతం చమురు ధరలు పెరిగాయి
ట్రంప్ ప్రకటన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతం పెరిగాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 73 డాలర్లకు, డబ్ల్యుటీఐ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 69.11 డాలర్లకు చేరుకుంది. ”ఈ సుంకాల యుద్ధం కొనసాగితే, చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, రెండో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు. ఇలాంటి పరిస్థితిలో, చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, భారత్ వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది” అని నరేంద్ర తనేజా అన్నారు. ‘వెనిజ్వెలాతో సంబంధాలు కొనసాగించడం భారత్‌కు సంబంధించిన విషయం’ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటే, వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి పదే పదే చెబుతున్నారు. దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని కొనసాగించడం, పరస్పర ప్రయోజనాలు, ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించడంపై సమావేశంలో చర్చించారు.

Related Posts
Israel: హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం
హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం

గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు మంగళవారం భీకర దాడికి దిగాయి. జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం Read more

బైడెన్‌ నిర్ణయం: ట్రంప్ అధికారంలోకి రాకముందు ఉక్రెయిన్‌కు కీలక మద్దతు
biden zelensky

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, ఇది ఉక్రెయిన్‌కు మిత్ర దేశం నుండి మరింత మద్దతును అందించడానికి Read more

Myanmar : ఇప్పటివరకు మృతుల సంఖ్య ఎంతంటే…!
Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్‌లో వచ్చిన తీవ్రమైన భూకంపం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తు అనేక ప్రాణాలను బలిగొంటూ, వేల మందిని నిరాశ్రయులను చేసింది. తాజా సమాచారం Read more

నేడు పార్లమెంటుముందుకు కొత్తఐటీ బిల్లు
New IT bill before Parliame

కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి, ఆధునిక అవసరాలకు తగిన విధంగా మార్చే లక్ష్యంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *