కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తించేందుకు ట్రంప్ యత్నాలు

Canada: కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తించేందుకు ట్రంప్ యత్నాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన చిరకాల కోరికను మరోసారి బయటపెట్టుకున్నారు. ఇది-గతంలో వివాదానికి తెర తీసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గట్లేదు. పొరుగుదేశం కెనడాను విలీనం చేసుకోడానికి ఉద్దేశించిన ప్రతిపాదనల దుమ్ము దులిపారు.
Oh Canada! క్యాప్షన్ జత చేసిన ట్రంప్
కెనడాను అమెరికాలో విలీనం చేసుకున్నట్లు. గతంలో డొనాల్డ్ ట్రంప్ రెండు కొత్త మ్యాప్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అమెరికా, కెనడా దేశాలపై జాతీయ జెండా పరిధిలోకి తీసుకొచ్చారు. Oh Canada! అనే క్యాప్షన్ దానికి జత చేశారు అప్పట్లో. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఈ వివాదానికి బీజం వేశారు. ఈ క్రమంలో కెనడా ప్రధానమంత్రిని గవర్నర్ ఆఫ్ కెనడాగా సంబోధించారు. తన సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ తరువాతే ఈ కొత్త మ్యాప్‌ను పోస్ట్ చేశారు. కెనడాను విలీనం చేసుకోవడానికి ఎకనామిక్ ఫోర్స్ను ప్రయోగిస్తాననీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దాన్ని చేతల్లో చూపిస్తోన్నారు.

Advertisements
కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తించేందుకు ట్రంప్ యత్నాలు

కెనడాను విలీనం కావడమే మంచిది: కరోలినా లెవిట్
తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ ఇదే అంశంపై మాట్లాడారు. వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీన్ని ప్రస్తావించారు. కెనడాపై డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం ఏమీ మారలేదని అన్నారు. అమెరికా 51వ రాష్ట్రంగా కెనడాను గుర్తించడానికి, దాన్ని విలీనం చేసుకోవడానికీ ట్రంప్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తోన్నారని, ఏ రకంగా చూసినా అమెరికాలో కెనడా విలీనం కావడమే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో కెనడా విలీనం గురించి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదని, అయినంత మాత్రాన ఆ విషయాన్ని మరిచిపోయినట్టు కాదని చెప్పారు. ప్రతి రోజూ దీనిపై ఆయన స్టాఫ్‌తో చర్చిస్తోన్నారని వివరించారు.
కెనడా రక్షణ శాఖ పరిధి చిన్నది
కెనడా రక్షణ శాఖ పరిధి చాలా పరిమితంగా ఉంటోందని, ఎక్కువగా తమ దేశ సైనిక శక్తి మీద ఆధారపడుతోందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతున్నట్లు కరోలినా లెవిట్ చెప్పారు. సైనిక చర్య ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలనుకునే అభిప్రాయం ఆయనకు లేదని తేల్చిచెప్పారు. ఎకనమిక్ ఫోర్స్ ద్వారా కెనడాను విలీనం చేసుకోవాలనుకుంటోన్నట్లు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రస్తావించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికాలో విలీనమైతేనే కెనడాకు అన్ని రకాలుగా మేలు కలుగుతుందని కరోలినా స్పష్టం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కెనడాపైనా టారిఫ్‌ను విధించారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Read Also: UK Lottery : బంపర్ లాటరీ గెలిచాడు…కానీ

Related Posts
Nepal : హింసాత్మక ఘటనపై నేపాల్‌ మాజీ రాజుకు జరిమానా
Nepal హింసాత్మక ఘటనపై నేపాల్‌ మాజీ రాజుకు జరిమానా

Nepal : హింసాత్మక ఘటనపై నేపాల్‌ మాజీ రాజుకు జరిమానా నేపాల్‌లో రాచరిక పునరుద్ధరణ కోసం నిర్వహించిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.ఈ నిరసనలు హింసాత్మకంగా Read more

Trump : ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు – చైనా
అమెరికాపై 125 శాతం సుంకాలు విధించిన చైనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 50% టారిఫ్ విధిస్తానని హెచ్చరించిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని Read more

Indian Americans: అమెరికాలో భారతీయులకు కొత్త ఇమిగ్రేషన్ సవాళ్లు
హెచ్‌1బీ వీసాదారులకు టెక్ కంపెనీల హెచ్చ‌రిక‌లు

గ్రీన్ కార్డ్, హెచ్-1బీ వీసాదారులకు కొత్త చిక్కులుఅమెరికాలో స్థిరపడిన భారతీయులు ఇటీవలి కాలంలో కఠినమైన ఇమిగ్రేషన్ తనిఖీలను ఎదుర్కొంటు న్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ, విమానాశ్రయాల్లో అదనపు Read more

Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు పిల్స్, పిటిషన్ల అంశంపై సీరియస్ కామెంట్స్ చేసింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామంటే ఒప్పుకోబోమని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా, గార మండలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×