మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

Donald Trump: మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశం నుంచి చమురు కానీ, గ్యాస్ కానీ కొనుగోలు చేసే దేశాలపై తాము 25 శాతం పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. వెనెజులా నుంచి చివరిసారిగా జరిపిన కొనుగోలు నుంచి ఏడాది వరకు ఈ ఆంక్షలు అమలవుతాయని తెలిపారు.
ట్రంప్ తాజా నిర్ణయంతో చైనాపైనా ప్రభావం
ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ తో పాటు చైనాపైనా ప్రభావం పడనుంది. వెనెజులా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. 2024 జనవరిలో ఆ దేశం ఎగుమతి చేసిన చమురు ఉత్పత్తుల్లో మెజారిటీ వాటా భారతదేశానిదే. రోజుకు దాదాపు 2.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. గతేడాది విదేశాల నుంచి కొనుగోలు చేసిన మొత్తం ముడి చమురులో 1.5 శాతం వెనెజులా నుంచే దిగుమతి చేసుకుంది. అలాగే చైనాకు కూడా రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్ ల ప్రభావం భారత్, చైనాలపై పడనుంది.

మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

మండిపడ్డ వెనెజులా..
ట్రంప్ ఇటీవల అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని యుద్ధ విమానాలలో వారి వారి స్వదేశాలకు పంపిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా వెనెజులా పౌరులు 200 ల మందిని ప్రత్యేక విమానాల్లో ట్రంప్ వాపస్ పంపించారు. దీనిపై మండిపడ్డ వెనెజులా.. ఇకపై అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. అదేసమయంలో అమెరికాకు చమురు ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. వెనెజులా నిర్ణయంపై మండిపడ్డ ట్రంప్.. తాజాగా ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలా కొనుగోలు చేస్తే ఆయా దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై 25 శాతం పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

Related Posts
తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి పండుగకు ముందు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Read more

బరాక్ ఒబామా, మిషెల్ విడాకులు..?
Barack Obama, Michelle divorce..?

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మిచెల్‌ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు Read more

Minister Narayana: అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు : మంత్రి నారాయణ
Rs. 31,600 crore for the construction of Amaravati.. Minister Narayana

Minister Narayana: శాసనమండలిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ Read more

Harish Rao : రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ
Harish Rao రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ

Harish Rao : రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు భేటీ కావడం ఇప్పుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *