అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో మారు ట్రంప్ తీసుకున్న నిర్ణయం జో బైడన్ తో సహా మరికొందరికి షాక్ గా మారింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగుస్తున్న సమయంలో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.

క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవు
బైడెన్ క్షమాభిక్ష నిర్ణయాలపై ట్రంప్ షాక్ వందలాది మంది నేరస్తులకు క్షమాభిక్ష ప్రకటించారు. ఇక బైడెన్ సర్కార్ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని డోనాల్డ్ ట్రంప్ తాజాగా షాక్ ఇచ్చారు. ఆయన అధికారంలో ఉన్న చివరి రోజుల్లో జారీ చేసిన వాటిని రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ లో ఆయన పోస్ట్ చేశారు. నేరం చేసింది వారే అసలు ఆయనకి ఈ విషయం కూడా తెలియదని పేర్కొన్నారు. తనతో పాటు మరికొందరు అమాయకుల పైన రెండేళ్లపాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తుతో, తాము సంపాదించిన ఆధారాలన్నీ నాశనం చేశారన్నారు.
క్షమాభిక్ష పొందినవారికీ షాక్
ఇక ఈ పోస్ట్ తో బైడెన్ తో పాటు నాడు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించిన వారందరికీ ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది. వారికి క్షమాభిక్ష మంజూరు చేసిన జో బైడెన్ ట్రంప్ ప్రభుత్వం నుంచి కొందరు కీలక వ్యక్తులను రక్షించడానికి జో బైడెన్ తాను అధ్యక్ష పీఠం నుండి దిగే ముందు కొన్ని సాహసోపేతమైన చర్యలకు దిగారు. డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లి, జనవరి 6 2021 వ తేదీన యుఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన కేసును దర్యాప్తు చేసిన హౌస్ కమిటీ సభ్యులకు జో బైడెన్ క్షమాభిక్ష మంజూరు చేశారు.